మోహన్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కలెక్షన్ కింగ్ అని పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా వచ్చిన సినిమా “పెదరాయుడు”. ఈ సినిమా అప్పట్లోనే భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా దెబ్బకి అప్పటికే ఉన్న సినిమా రికార్డులు అన్ని చెరిగిపోయాయి. ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర హైలైట్ అయ్యింది. అయితే.. కేవలం 20 నిముషాలు మాత్రమే కనిపించే రజిని పాత్ర మరింత హైలైట్ అయ్యింది.
Advertisement
రజినీకాంత్ సలహాతోనే ఈ సినిమా తమిళ హక్కులను మోహన్ బాబు కొనుగోలు చేసారు. తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమాను నిర్మించారు. ఇంటిపెద్దకు ఎంత విలువ ఇవ్వాలి అన్న విషయాన్నీ ఈ సినిమాలో చూపించారు. వాస్తవానికి, ఈ సినిమా రిలీజ్ అయిన టైం లోనే చిరంజీవి బిగ్ బాస్ సినిమా రిలీజ్ కూడా ఉంది. చిరు సినిమా రిలీజ్ అయితే మోహన్ బాబు సినిమాకి కలెక్షన్స్ రావేమోనని భయపడ్డారు. కానీ, వారం రోజులలో కథ రివర్స్ అయ్యింది. పెదరాయుడు సినిమా సూపర్ హిట్ అవ్వగా, చిరు బిగ్ బాస్ సినిమా యావరేజ్ గా నిలిచింది.
Advertisement
పెద రాయుడు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి, డబ్బులు లెక్కించడానికి మిషన్లు అవసరమయ్యేంతగా విజయం సాధించింది. జూన్ 15 1995 న విడుదల అయిన ఈ సినిమాపై మొదట్లో ఎలాంటి అంచనాలు లేవు. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా 39 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. అందరు చిరంజీవి బిగ్ బాస్ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ, పెదరాయుడు సినిమా గట్టి షాక్ ఇచ్చింది. ఈ సినిమా అప్పటికే చిరు ‘ఘరానా మొగుడు’ సాధించిన రికార్డు లను దాటేసింది.