ప్రతి ఒక్కరు ఇంట్లో చెట్లను పెంచడం, వాటిని పూజించడం వంటివి ఇష్టంగా చేస్తూ ఉంటారు. చెట్లను పూజించడం పూర్వం నుంచి వచ్చిన ఆచారాలే. కానీ కొన్ని రకాల చెట్ల నీడలు మాత్రం ఇంటి మీద అసలు పడకూడదు. అలాంటి చెట్ల నీడలు ఇంటి మీద పడినట్లయితే కష్టాలు మొదలవుతాయి అని పండితులు చెబుతున్నారు. అటువంటి చెట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం…
Advertisement
# రావి చెట్టు చుట్టూ తిరిగితే సంతాన దోషాలు, జాతక దోషాలు పోతాయని పండితులు చెబుతూ ఉంటారు. కానీ ఈ చెట్టు నీడ మాత్రం ఇంటి మీద అస్సలు పడకూడదు. ఒకవేళ అలా పడితే కుటుంబ సభ్యులు వృద్ధిలోకి రారని, ఇంట్లో అప్పులు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయని పండితులు చెబుతున్నారు.
# చింత చెట్టు మన ఇంటి స్థలంలో చింత చెట్టుని అస్సలు పెంచుకోకూడదు. దీనివల్ల ఇంట్లో గొడవలు, ఒత్తిడి అధికమవుతాయి. కుటుంబ సభ్యులు మానసిక ప్రశాంతత కోల్పోతారట. అంతేకాకుండా ఇంట్లో ఉన్న కుటుంబ పెద్ద ఆయుష్షు కూడా తగ్గిపోతుంది.
Advertisement
# మునగ చెట్టు ఆకులు, కాయల వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయని దాదాపు చాలామంది అంటూ ఉంటారు. కానీ మునగ చెట్టుని ఇంట్లో పెంచుకోవడం, ఆ చెట్టు నీడలో భార్యాభర్తలు తిరిగితే సంతాన సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి పిల్లల కోసం ఎదురుచూసే జంటలు ఈ చెట్టు ఆవరణలో అసలు తిరగకూడదు.
# తుమ్మ చెట్టును పొరపాటున కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఒకవేళ దానంతట అదే పెరిగితే మాత్రం వెంటనే తీసేయాలి. ఆ చెట్టుకి ఉన్న ముల్లులలాగే మన ఇంట్లో కూడా ఎప్పుడూ ఏదో ఒక బాధలు, గొడవలు వస్తూనే ఉంటాయి. వాటిని పెంచుకోవడం వలన ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే అవి అసలు పోయే అవకాశం కూడా ఉండదు. అందువల్లనే ఇంట్లో చెట్లని పెంచుకునే ముందు ఇలాంటి చెట్లను లేకుండా చూసుకోవాలి.
ఇవి కూడా చదవండి
Virat Kohli : క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ?
సీఎం కేసీఆర్ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం…!