Home » మహేష్ బాబు సినిమాలో దర్శకుడు మెహర్ రమేష్ కమెడీయన్ గా నటించాడనే విషయం మీకు తెలుసా ?

మహేష్ బాబు సినిమాలో దర్శకుడు మెహర్ రమేష్ కమెడీయన్ గా నటించాడనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రెండు సినిమాల గురించి యువత ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఆగస్టు 10న రజినీకాంత్ జైలర్, ఆగస్టు 11న చిరంజీవి భోళా శంకర్ సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ మాత్రం నెగెటివ్ టాక్ తో అంతంత మాత్రం కలెక్షన్లను వసూలు చేస్తుందని తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా తరువాత చిరుకు మరో ఘోరమైన సినిమా ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

Advertisement

ముఖ్యంగా ఫ్లాప్ డైరెక్టర్ గా ఇంతలా ట్రోలింగ్ కి గురవుతున్న మెహర్ రమేష్ లో ఓ మంచి నటుడు ఉన్నాడని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కామెడీ కూడా చేశాడు. సాధారణంగా డైరెక్టర్ మెహర్ రమేష్ పేరు చెప్పగానే కంత్రి, శక్తి, షాడో, ఇప్పుడు భోళా శంకర్ వంటి ఫ్లాప్ సినిమాలు గుర్తుకువస్తాయి. దర్శకుడు కాకముందు మెహర్ రమేష్ 2002లో విడుదలైన బాబీ మూవీలో మహేష్ బాబు స్నేహితుడిగా నటించాడు. ఇందులో సునీల్ అనే కామెడీ రోల్ చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బాచీ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. 2004లో ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాని కన్నడంలో వీరకన్నడిగగా రీమేక్ చేసి మంచి దర్శకుడిగా మారాడు. 2006లో పోకిరి సినిమా సహ రచయితగా, దేశముదురు సినిమాలో నటుడిగా చేశాడు.

Advertisement

2008లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కంత్రి మూవీతో తెలుగు సినిమా రంగంలో దర్శకుడిగా అడుగు పెట్టారు మెహర్ రమేష్. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన కంత్రి, బిల్లా వంటి సినిమాలకు టైటిల్ పాటలను రాశాడు. కన్నడలో ఆంధ్రావాలా రీమేక్ తో పాటు మహేష్ బాబు ఒక్కడు మూవీని కూడా అజయ్ గా రీమేక్ చేసి మరో హిట్ సాధించాడు. కన్నడలో రీమేక్ చేసి మంచి సక్సెస్ సాధించిన మెహర్.. తెలుగులో మాత్రం ఆయన దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడా హిట్ సాధించలేకపోయింది. తాజాగా భోళా శంకర్ మూవీ బోల్తా కొట్టడంతో సోషల్ మీడియా ట్రోలింగ్స్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు మెహర్ రమేష్. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

NTR: ఎన్టీఆర్ పక్కన హీరోయిన్స్ గా నటించిన ఈ తల్లీ కూతుళ్లు ఎవరో తెలుసా? ఏ ఏ సినిమాల్లో అంటే?

స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో వచ్చిన మొట్ట మొదటి సినిమా ఏదో తెలుసా ?

Visitors Are Also Reading