Home » Abbas: విశాల్ మాట్లాడిన ఆ మాటలకి చాలా బాధ పడ్డా.. ఎమోషనల్ అయిన అబ్బాస్..!

Abbas: విశాల్ మాట్లాడిన ఆ మాటలకి చాలా బాధ పడ్డా.. ఎమోషనల్ అయిన అబ్బాస్..!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

హీరో అబ్బాస్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాలు తీసి ఒకేసారి స్టార్ హీరోగా అబ్బాస్ గుర్తింపు తెచ్చుకున్నారు. అబ్బాస్ ఎంత స్పీడ్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారో అంతే స్పీడుగా ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది. ఆయన నటించిన ప్రేమ దేశం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఆయనకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ఇప్పటికీ చెరిగిపోనిది. అమ్మాయిల కలల రాకుమారిడిలా కనిపించిన అబ్బాస్ సినిమాలకు దూరం అయ్యారు.

Advertisement

2015 లో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన అబ్బాస్ ఫామిలీ తో కలిసి న్యూజిలాండ్ కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన రీ ఎంట్రీ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో అబ్బాస్ కనిపిస్తున్నారు. ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూ లో పార్టిసిపేట్ చేసిన ఆయన తమిళ నటుల గురించి చిట్ చాట్ లో మాట్లాడారు. నటుడు విశాల్ గురించి మాట్లాడుతూ ఆయనతో సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) సమయంలో విబేధాలు వచ్చాయని చెప్పారు.

Advertisement

నటుల మధ్య సామరస్యం పెరగడం కోసమే ఇటువంటివి పెడతారని, కానీ ఆ సమయంలో నటుడు విశాల్ తో విబేధాలు తలెత్తాయన్నారు. అతను నా గురించి ఇతరులకు అబద్ధాలు చెప్పేవాడని చెప్పుకొచ్చారు. మర్యాద లేని చోట ఉండడం ఇష్టం లేకే ఆ ఆటనుంచి తప్పుకున్నానన్నారు. అతను చిత్ర పరిశ్రమ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఏ కుటుంబంలో అయినా మనస్పర్థలు సహజం అన్నారు. అతనిని ఎప్పుడో క్షమించమని, కనిపిస్తే హాయ్ అని చెప్పగలను కానీ.. గతంలో లా సన్నిహితంగా ఉండలేనని అన్నారు. ఆ టైం లో అతను మాట్లాడిన మాటలకి మాత్రం చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు.

మరిన్ని ముఖ్యమైన వార్తలు :

విరూపాక్ష కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె హీరోని డామినేట్ చేస్తుందని తీసేసారట..!

 ఏడేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ భోళా శంకర్ మూవీని మొదలు పెట్టాడనే విషయం మీకు తెలుసా ? 

Visitors Are Also Reading