చాణక్యుడు తన నీతి శాస్త్ర విధానంలో ఎంతో మందికి ఉత్తమమైన దారిని సూచించారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే అధైర్యపడొద్దని చాణిక్య నీతి శాస్త్రంలో వెల్లడించబడింది. మనిషిలో ఈ కొన్ని గుణాలు ఉంటే.. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవచ్చని చాణక్య నీతిశాస్త్రం చెబుతోంది. చాణిక్య నీతి ప్రకారం ఆపద సమయంలో ఈ విషయాలను అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా అధికమించవచ్చని వెల్లడిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
#1. ఓర్పు :
ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనిషి తన ఆత్మనిగ్రహాన్ని, బలాన్ని, సహనాన్ని ప్రదర్శించాలని చాణక్యుడు తెలియజేస్తున్నారు. ఆయన నీతి ప్రకారం, చెడు సమయాలను అధిగమించడానికి సహనంతో ఓర్పు వహించడం ద్వారా క్లిష్ట పరిస్థితులను అధిగమించగలరు.
#2. భయాన్ని అధిగమించండి :
భయం అనేది మనల్ని ఏ పరిస్థితుల్లోనైనా సరే బలహీనపరుస్తుంది. భయం అనేది మన జీవితాలపై ఆధిపత్యం చేస్తుంది. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి చెడు పరిస్థితులను ఎదుర్కోలేడు. ఎవరైతే భయాన్ని నియంత్రించుకొని ముందుకు వెళతారో వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులైన ఎదుర్కోగలరని చాణిక్య నీతిలో చెప్పబడుతుంది.
#3. ప్రశాంతంగా ఉండటం :
ఎవరి జీవితంలోనైనా సరే ఏదో ఒక సమయంలో కష్టాలు ఎదురవుతూ వస్తాయి. చాణక్యుడి నీతి ప్రకారం, ఎవరైనా కష్ట సమయాల్లో సహనం కోల్పోకుండా ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో సరైన నిర్ణయాలు తీసుకోవాలని చాణిక్యులు చెప్తున్నారు.
#4. స్నేహితులతో కలిసి ఉండడం.
చెడు సమయాల్లో తల్లిదండ్రుల తర్వాత మీకు అండగా నిలిచే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే అది నిజమైన స్నేహితులు మాత్రమే. కష్ట సమయాల్లో అలాంటి వ్యక్తులు మీకు అండగా నిలవడం వల్ల మీరు ఇలాంటి సమస్యల నైనా సరే అధిగమించగలుగుతారు అని చాణిక్యుడు వెల్లడిస్తున్నారు.
#5. సరైన ప్రణాళిక:
చాణిక్య నీతి ప్రకారం కష్ట సమయం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు సరైన ప్రణాళికను అవలంబిస్తారో మంచి వ్యూహంతో చెడు సమయాన్ని అధిగమించడం సులభం అవుతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఈ వారంలో అదృష్టం కలిసొస్తుంది
Love line : మీ అరచేతిలో ఈ రేఖ ఉందా? అయితే మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోందో తెలుసుకోండి!
తిరుమల శ్రీవారిని “గోవిందా” అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా..?