చాణక్యుడి గురించి నేటి తరానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తరతరాలుగా ఆయన రచించిన అర్ధశాస్త్రంలోని మెళకువలను నేటికీ మనం నేర్చుకుంటున్నాం. కేవలం అర్ధ శాస్త్రం మాత్రమే కాదు బ్రతకడానికి అవసరమైన ఎన్నో జీవిత సత్యాలను కూడా చాణుక్యుడు వివరించాడు. చాణుక్యుడు చెప్పిన నీతి వాక్యాలన్నీ ప్రస్తుతం చాణక్య నీతి అన్న గ్రంధం ద్వారా నేటి తరానికి చేరుతున్నాయి.
లోకజ్ఞానం గురించి చాలా సూక్తులు చెప్పిన చాణుక్యుడు భార్యాభర్తలకు కొన్ని నీతి వాక్యాలను కూడా చెప్పాడు. కొన్ని తప్పుల వలన వివాహం విడాకుల వైపుకు దారి తీస్తుందని, వైవాహిక జీవితంలో ఈ తప్పులను అస్సలు చేయవద్దని చెప్పారు. ఆయన ఏమి చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తికి ఉన్న కోపం కేవలం ఓ కారణం మాత్రమే కాదు అది అన్ని బంధాలకు ముగింపు పలికే కారకం కూడా. మితిమీరిన కోపం వలన వైవాహిక జీవితంలో శాంతి ఉండదు. సంఘర్షణలు ఎక్కువై బంధం బలహీనం అవుతుంది.
ఫలితంగా భాగస్వామికి విడాకులే పరిష్కారంగా కనిపిస్తాయి. అలాగే వ్యక్తిగత రహస్యాలను కూడా మీ దగ్గరే ఉంచుకోవాలి. మీ మధ్య సంభాషణలు మూడవ వ్యక్తికి తెలిస్తే.. అవి ఎటువైపు దారితీస్తాయో తెలియదు. దీని వలన ఉన్న సమస్య మరింత జటిలం అవుతుంది. అలాగే.. అబద్ధాల వలన కూడా భార్యాభర్తల బంధం బీటలు వారుతుంది. ఒకసారి నమ్మకం కోల్పోయాక ఆ బంధం నిలబడడం కష్టమే అవుతుంది. ప్రతి బంధానికి ఓ పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటితే ఏ బంధం అయినా గొడవలకు దారితీస్తుంది. అందుకే అన్నీ చూసుకుని నడుచుకోవాలి. ఒకరికొకరు అండగా ఉంటూ పరిస్థితులను ఎదుర్కోవాలి. ఒకరు ఓర్పుగా ఉన్నా మరొకరు సైలెంట్ అవుతారు. ఇద్దరు గొడవకు దిగితే.. బంధం విడిపోతుంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
చాణక్య నీతి: ఏ విషయాలను మనం రహస్యంగా ఉంచుకోవాలి తెలుసా?
చాణక్య నీతి: ఈ 8 మందికి ఇతరుల బాధ ఎప్పటికీ అర్ధం కాదు!
చాణక్య నీతి : ఈ ముగ్గురికి అస్సలు సాయం చేయకూడదట..!!