ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ఇంకా చెప్పాలి అంటే స్మార్ట్ ఫోన్ జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అతి చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ కూడా స్మార్ట్ ఫోన్లోనే కొందరు తమ పనులను పూర్తి చేసేస్తున్నారు. ఇక యువత అయితే తమ ఫోటోలను క్లిక్ చేస్తూ ఆన్లైన్లో చాటింగ్‌లో మీటింగ్‌లో అంటూ ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ తోనే కాలం గడిపేస్తున్నారు.
Advertisement
మరి ఇంతగా ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ కి ఏదో ఒక సమయంలో చార్జింగ్ పెట్టవలసి వస్తుంది. ఫోన్లో బ్యాటరీ అనేది ముఖ్యమైన భాగం. బ్యాటరీ సక్రమంగా పనిచేసినప్పుడు మాత్రమే మనం ఫోన్‌ని మంచిగా ఉపయోగించుకోగలుగుతాం. ఫోన్ ఛార్జ్ చేసే విధానంలో చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కొందరు పగలంతా ఫోన్ ని బాగా యూజ్ చేసిన తర్వాత రాత్రి మొత్తం చార్జింగ్ పెట్టేసి అలాగే వదిలేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతా.. కాదా.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఫోను ఉపయోగించడంలో బ్యాటరీ అనేది అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఫోన్లోని ఎన్ని ముఖ్యమైన భాగాలు ఉన్నా బ్యాటరీ సరిగ్గా పనిచేయనప్పుడు స్మార్ట్ ఫోన్ ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అయిపోతుంది. అత్యవసర సమయంలో బ్యాటరీ సపోర్ట్ చేయకుంటే ఫోన్ ని యూస్ చేయడం అనేది కష్టతరమవుతుంది. అటువంటి పరిస్థితిలో, బ్యాటరీ యొక్క కండీషన్ ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. చాలా మంది ఫోన్ 100 శాతం ఛార్జింగ్ అయ్యే వరకు అలానే చార్జింగ్ లో పెట్టి ఉంచుతారు. అంతేకాకుండా బ్యాటరీ 10 శాతానికి పడిపోయిన వరకు ఛార్జింగ్‌ను పెట్టారు.
ఈ తప్పును మనలో చాలామంది ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఫోన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ అయిపోయే వరకు వేచి ఉండటం సరికాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. అలా చేయడం వల్ల బ్యాటరీ లో ఉండే లిథియం అయాన్ దెబ్బతింటుంది. ఇలా ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోయినా లేక పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు చాలా ఒత్తిడికి గురవుతాయి. తద్వారా లిథియం-అయాన్ బ్యాటరీల జీవితాన్ని తగ్గిస్తుంది. ఎప్పుడు కూడా ఫోన్ యొక్క ఛార్జింగ్‌ను 80 నుండి 90 శాతం రాగానే ఆపివేయాలి. అలాగే, ఫోన్ బ్యాటరీ 20 లేదా 30 శాతంకి పడిపోయిన వెంటనే దానిని తిరిగి ఛార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం ద్వారా ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం సపోర్ట్ చేస్తుంది.