సినిమా రిలీజ్ అన్నాక ప్రమోషన్స్ చేసుకోవడం సహజం. అయితే.. ప్రతి సినిమాలో నటించిన హీరోలు, హీరోయిన్స్, ఇతర ఆర్టిస్ట్ లు తమ సినిమా ప్రమోషన్ కోసం కష్టపడతారు. కొన్ని సార్లు ఇతర హీరోల హెల్ప్ కూడా తీసుకుంటారు. వారిని కూడా తమ మూవీ కి వచ్చి ప్రమోట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తారు. అయితే.. ఇది చాలా సాధారణం అయిపొయింది. కానీ, మహేష్ బాబు మాత్రం తన సినిమాల ప్రమోషన్స్ కి తప్ప ఏ ఇతర హీరోల ప్రమోషన్స్ లోను పెద్దగా కనిపించరు. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూ లో మహేష్ బాబే క్లారిటీ ఇచ్చారు.
Advertisement
చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడానికి చాలానే కష్టపడ్డారు. ఎన్నో హిట్లు అందుకున్న మహేష్ బాబు అపజయాలకు వెనుకడుగు వెయ్యలేదు. అయితే.. ఒకానొక టైం లో అర్జున్ సినిమా విడుదల అయిన సమయంలో మహేష్ చాలా బాధ పడ్డారు. ఆ సినిమా రిలీజ్ రోజునే పైరసీ బారిన పడింది. ఆ సమయంలో మహేష్ ఒకరకంగా డిప్రెషన్ కి వెళ్లిపోయారట.
Advertisement
ఈ సమయంలో ఏ టాలీవుడ్ హీరో కూడా ఆయనకు సపోర్ట్ గా రాలేదట. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఆయనకు దగ్గరగా ఉండి ధైర్యం చెప్పారట. సెలెబ్రేషన్స్ సమయంలో అందరు సంతోషం పంచుకున్నప్పుడు.. కష్టం వచ్చినప్పుడు తోడు ఎవ్వరు రారని మహేష్ బాబు ఫీల్ అయ్యారట. అప్పటి నుంచి ఇతర హీరో ఈవెంట్స్ కి వెళ్లడం లేదని మహేష్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలకు షూటింగ్ పనిలో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.
మరిన్ని..
BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే
“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !
హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !