Home » ప్రభుదేవాని హీరోగా పెట్టి సినిమా తీస్తే కుక్కలు కూడా చూడవు అని అవమానించిన వ్యక్తి ఎవరు..?

ప్రభుదేవాని హీరోగా పెట్టి సినిమా తీస్తే కుక్కలు కూడా చూడవు అని అవమానించిన వ్యక్తి ఎవరు..?

by Mounika
Ad

ఇండియన్ మైకేల్ జాక్స‌న్‌ ఎవరు అని అడగగానే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభుదేవా. ప్రభుదేవా కేవలం కొరియోగ్రాఫర్ గానే కాకుండా యాక్టర్ గా, డైరెక్టర్ గా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. కొరియోగ్రాఫర్ గా సక్సెస్ అయిన ప్రభుదేవా ఒకానొక సమయంలో నటుడుగా గుర్తింపు తెచ్చుకోవడానికి మాత్రం చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందట.

Advertisement

1993లో శంకర్ దర్శకత్వంలో  యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన  జెంటిల్‌మేన్‌ చిత్రం అప్పటిలో ఎంత సూపర్ డూపర్ హిట్  అయిందో వేరే చెప్పనక్కర్లేదు. డైరెక్టర్ శంకర్ తన మొదటి చిత్రంతోనే సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించారు. జెంటిల్మాన్ చిత్రానికి గాను కుంజుమన్ నిర్మాణ సారథ్యం  వహించారు. ఈ సినిమా టీవీలో ప్రసారమైతే అభిమానించే ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభుదేవా నటించిన చికుబుకు చికుబుకు రైలే పాట అప్పట్లో దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా అప్పటిలో మూవీ మేకర్స్ కి కాసుల వర్షం కురిపించింది.

 ఇక నిర్మాత కుంజుమన్ తనకు లాభాలు తెచ్చిపెట్టిన  దర్శకుడు శంకర్ తోనే మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. మనం ఇంకొక సినిమా కూడా కలిసి చేయాలి. నువ్వు వెంటనే ఒక మంచి కథ రెడీ చేస్కో అంటూ శంకర్ కి మరో అవకాశం కల్పించాడట నిర్మాత కుంజుమన్. నెక్స్ట్ సినిమా కోసం శంకర్ ఒక మంచి లవ్ స్టోరీ రెడీ చేసుకుని కుంజుమన్ టీం కి ఆ స్టోరీ లైన్ చెప్పడం జరిగిందట. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడు ఏకంగా గవర్నర్‌ కుమార్తెను ప్రేమిస్తాడు అని శంకర్ స్టోరీ లైన్ చెప్పగానే వెంటనే కుంజుమన్ కథ పూర్తిగా వినకుండానే ఓకే చెప్పేసారట.

Advertisement

 ఇక వెంటనే ఆ సినిమాకు ప్రేమికుడు అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేయడం జరిగిందట. హీరోగా ఎవరిని పెడదామని ఆలోచించే టైంలో నిర్మాత కుంజుమన్  మీ మొదటి సినిమాలో చికుబుకు చికుబుకు రైలే పాటకు డాన్స్ ఇరగదీసిన ప్రభుదేవా అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేశారట. కానీ శంకర్ అతన్ని ఒక 5 నిమిషాల పాటలో ఎవరైనా చూస్తారుగాని రెండున్నర గంటలు పాటు అతన్ని చూడలేరు. ప్రభుదేవా సన్నగా, పీలగా, గుబురు గడ్డంతో అసలు ప్రేమికుడి టైటిల్ కి  అసలు సంబంధంమే లేనట్టుగా ఉంటాడు. హీరోగా జనాలు అతని యాక్సెప్ట్ చేయలేరు అంటూ శంకర్ ప్రభుదేవాని హీరోగా వద్దని చెప్పారట.

డైరెక్టర్ దగ్గర నుండి డిస్ట్రిబ్యూటర్స్ వరకు కూడా ప్రభుదేవా హీరోగా చేస్తే సినిమా సక్సెస్ అవుతుందా అంటూ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారట. కానీ ప్రొడ్యూసర్ కుంజుమన్ మాత్రం అతను అయితేనే  ఈ చిత్రానికి బాగుంటుంది అంటూ హీరోగా ప్రభుదేవాని ఫిక్స్ చేయటం జరిగిందట.  ఇక నిర్మాతే ఓకే చేసిన తర్వాత మిగతా వారు చేసేదేం లేక ప్రభుదేవానే హీరోగా పెట్టి ప్రేమికుడు సినిమాని  పూర్తి చేసి  1994, సెప్టెంబరు 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయగా ప్రేమికుడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు  :

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు….!

సినిమాలలో హీరో, హీరోయిన్లు వాడే కాస్ట్యూమ్స్ ను ఏం చేస్తారో తెలుసా…?

ఇలియానా హీరోయిన్ గా, తమన్నా విలన్ గా నటించిన ఈ సినిమా ఏదో తెలుసా? హీరో ఎవరంటే?

Visitors Are Also Reading