నేటి కాలంలో చాలామంది ఇయర్ బడ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా బస్సు, రైలు, మెట్రో, ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు చాలా మంది ఇయర్ బడ్స్ పెట్టుకొని కనిపించడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ కొంత మంది అదేపనిగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిత్యం ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటున్నారు.ఇది పెద్ద ఫ్యాషన్ గా భావిస్తున్నారు ఏమో కానీ.. నిద్రపోయేటప్పుడు కూడా అవేవో కొత్త ఆభరణాలు లాగా చెవులకు ఉంచుకుంటున్నారు. అయితే ఇలా ఎక్కువ సేపు ఇయర్‌ఫోన్స్, ఇయర్ బడ్స్ వాడితే మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా నాశనం చేసుకుంటున్నారు అని మీకు తెలుసా..
Advertisement
రాత్రివేళ నిద్రపోయే సమయంలో చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకొని మొబైల్ చూస్తూ ఉండిపోవడం అస్సలు మంచిది కాదని కొన్ని అధ్యయనాల ద్వారా రుజువయ్యాయి. అప్పుడప్పుడు ఉపయోగించడం వల్ల పెద్ద నష్టం లేదు. కానీ రోజు అదే పనిగా ఇయర్ బర్డ్స్ని వాడితే మాత్రం కచ్చితంగా దుష్ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ అలవాటు అనేది తీవ్ర అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది.
Advertisement
ఇక రాత్రంతా ఇయర్ బడ్స్ చెవిలో పెట్టుకొని ఫోన్ చూస్తూ నిద్రపోవడం వలన చెవులలో వినికిడి సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ అలవాటు చెవి నొప్పి తీవ్రమైన చెవి నొప్పి సమస్యకు దారితీస్తుంది. అంతేకాకుండా ఈ అలవాటు ఎక్కువగా కొనసాగిస్తే మాత్రం మెదడు నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇయర్ బర్డ్స్ లేక ఇయర్ ఫోన్స్ ధరించి గంటల తరబడి సంగీతం వినడం చెవులకు మరియు గుండెకు అస్సలు మంచిది కాదు. దీని వల్ల గుండె వేగంగా కొట్టుకోవడమే కాకుండా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్ నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై చెడు ప్రభావం చూపుతాయి. ఈ కారణంగా, తలనొప్పి మరియు మైగ్రేన్ సమస్య తలెత్తుతుంది. చాలా మంది వ్యక్తులు నిద్ర భంగం, నిద్రలేమి లేదా స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు.కాబట్టి వీలైనంత వరకు ఈ అలవాటును దూరం చేసుకోవడం మంచి పద్ధతని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.