Home » Eye infection : కండ్లకలక తగ్గాలంటే మన అమ్మమ్మలు చెప్పిన బెస్ట్ చిట్కా ఏంటో తెలుసా..?

Eye infection : కండ్లకలక తగ్గాలంటే మన అమ్మమ్మలు చెప్పిన బెస్ట్ చిట్కా ఏంటో తెలుసా..?

by Mounika
Ad

Eye infection : కళ్ళు శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. కళ్ళు సక్రమంగా ఉన్నప్పుడు  మాత్రమే మనం ఈ లోకాన్ని చూడగలం. కానీ కొన్ని సమయాల్లో కళ్ళు కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో వాతావరణం లో మార్పుల వలన చాలా సార్లు కళ్ళలో ఇన్ఫెక్షన్ లేదా వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణ భాషలో ఈ ఇన్ఫెక్షన్ నే కండ్లకలక లేదా పింక్ ఐ  అని పిలుస్తారు.

Advertisement

ఈ సమస్యకు ఎక్కువగా పిల్లలలో మనం తరచూ చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితిలో, బ్యాక్టీరియా మరియు వైరస్లతో ఇన్ఫెక్షన్ ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తూ వస్తుంది . ఈ సమయంలో దురద, మంట మరియు కళ్ళ నుండి నీరు కారడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . కండ్ల కలక సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో  ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

#1. ఒక గిన్నెలో చెంచాడు పసుపు వేసుకొని పేస్టులా కలుపుకోవాలి. ఒక తెల్లని కాటన్ క్లాత్ తీసుకొని పసుపులో  ముంచి కొంత సమయం ఆరనివ్వాలి. ఆ తర్వాత ఆ కాటన్ క్లాత్ ని నీరు కారుతున్న కన్నుమీద సున్నితంగా ఒత్తుతూ ఉండాలి. పసుపులో యాంటీబయోటిక్ లక్షణాలు ఉండటం వలన కండ్లకలక త్వరగా తగ్గుతుంది. ఈ చిట్కా మన అమ్మమ్మల కాలం నుంచి బెస్ట్ రెమెడీగా పనిచేస్తుంది.

#2. ఆముదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆముదం ఒకటి లేదా రెండు చుక్కలు కళ్లలో వేసుకుంటే మేలు చేస్తుంది. ఇది కంటి సమస్యలను తగ్గించడంలో బాగాసహాయపడుతుంది.

#3.పచ్చి జామ ఆకులు కంటి కలక వల్ల ఏర్పడిన వాపును తగ్గించడానికి జామ ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. పది జామ ఆకులను తీసుకుని బాగా శుభ్రం చేసి, వాటిని ఒక కప్పు నీటిలో చిటికెడు పసుపు, జామ ఆకులు వేసి మరిగించాలి. ఆ వేడి చేసిన ఆకులు కొంచెం చల్లబడిన తర్వాత కంటిపైన పెట్టుకుని విశ్రాంతి తీసుకోవడం ద్వారా కండ్లకలక ద్వారా ఏర్పడే వాపు తగ్గించడంలో సహాయం చేస్తుంది .

గమనిక : ఈ పరిష్కారాలు కేవలం కండ్లకలక సమస్య ఆరంభంలోని మాత్రమే ఉపయోగపడతాయి. కండ్ల కలక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని  సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Visitors Are Also Reading