టీమిండియా గత కొన్ని రోజులుగా ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఐపీఎల్, ఐసీసీ టోర్నమెంట్లు.. ఇలా వరుసగా క్రికెటర్లు మ్యాచ్లు ఆడుతున్న నేపథ్యంలో కీలక ఆటగాళ్లంతా గాయాల పాలు అవుతున్నారు. ఇందులో భాగంగానే టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, ప్రసిద్ధి కృష్ణ, కేఎల్ రాహుల్ ఇలా ఎంతోమంది క్రికెటర్లు ఇప్పటికే గాయాల పాలు అయి… ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారు.
Advertisement
అటు కారు యాక్సిడెంట్ కారణంగా… రిషబ్ పంత్ ఆరు నెలలుగా క్రికెట్కు దూరమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఈ క్రికెటర్ల హెల్త్ అప్డేట్ ను వదిలింది బీసీసీఐ. ఇక తాజాగా బీసీసీఐ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… బుమ్రా మరియు ప్రసిద్ధి కృష్ణ ఇద్దరూ రిహాబిలిటేషన్ చివరి దశలో ఉన్నారని స్పష్టం చేసింది. ప్రస్తుతం వారు ఇద్దరు చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారని… ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఆడుతున్నారని పేర్కొంది. త్వరలోనే జట్టులోకి కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బీసీసీఐ తెలిపింది.
Advertisement
అలాగే కేల రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ కూడా నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని… ప్రస్తుతం స్త్రెంత్ మరియు ఫిట్నెస్ డ్రిల్స్ చేస్తున్నారని పేర్కొంది. అటు కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ చాలా వేగంగా కోరుకుంటున్నాడని స్పష్టం చేసింది బీసీసీఐ. నెట్స్ లో బ్యాటింగ్ తో పాటు కీపింగ్ కూడా పంత్ ప్రాక్టీస్ చేస్తున్నాడని వెల్లడించింది. స్ట్రెంత్, రన్నింగ్ పై పంతు దృష్టి సారించాడని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
హీరోయిన్ వాణి విశ్వనాథ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !