Home » Sadha: సదా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా..ఆ సమస్యలు ఉన్నాయా ?

Sadha: సదా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా..ఆ సమస్యలు ఉన్నాయా ?

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ జయం ఫేమ్ సదా క్రేజ్ ఇప్పటికి తగ్గలేదు. 39 సంవత్సరాలు ఉన్న సదా… హీరో నితిన్ నటించిన జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సదా. ఈ సినిమా 2002 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో వెళ్ళవయ్యా వెళ్ళు.. వెళ్ళు అంటూ హీరోయిన్ సదా చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాయి.

Advertisement

ఇక జయం సినిమా తర్వాత టాలీవుడ్ లోని స్టార్ హీరోల సరసన నటించి అందరిని మెప్పించింది ఈ బ్యూటీ. ఇంకా 2014లో యమలీల 2 సినిమా చేసిన సదా… ఆ తర్వాత నుంచి… డాన్స్ మరియు కామెడీ షో లలో జడ్జిగా కనిపిస్తున్నారు. అయితే 39 సంవత్సరాలు ఉన్న సదా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా తను పెళ్లి చేసుకోకపోవడంపై.. హీరోయిన్ సదా క్లారిటీ ఇచ్చింది. తాను ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సదా.

Advertisement

ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా… పెళ్లి చేసుకుంటే ఈ సంతోషం పోతుంది… నాకు ఇష్టమైన పని చేస్తున్న అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బ్యూటీ. పెళ్లి చేసుకుంటే నా ఫ్రీడం మొత్తం పోతుంది… మనల్ని అర్థం చేసుకునే మగాడు దొరకడు… ఒకవేళ దొరికినా.. అంత ఫ్రీడమ్ ఉండదు అని పేర్కొంది. ఇక ఈ మధ్యకాలంలో చాలామంది.. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు… కానీ తక్కువ కాలంలోనే విడిపోతున్నారు… ఇలా పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే… సింగిల్ గా ఉండడం చాలా బెటర్ అని హీరోయిన్ సదా పేర్కొంది.

Visitors Are Also Reading