సాధారణంగా క్రికెట్ లో ‘మిస్టర్ 360’ అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఏబీ డివిలీయర్స్. అయితే సౌత్ ఆఫ్రికా స్టార్ తన కెరీర్ లో ఎన్నో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ లను ఆడాడు. అంతేకాదు.. మైదానం అన్ని వైపులా తన షాట్లు ఆడగలిగే సత్తా డివీలియర్స్ సొంతం చేసుకున్నాడు. అందుకే అందరూ అతడిని స్వీట్ గా ‘మిస్టర్ 360’ అని పిలుస్తారు. అతను అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన తరువాత మళ్లీ అంతటి ప్లేయర్ కోసం అభిమానులు ఎదురుచూశారు. ఇక వారందరికీ సమాధానంగా దొరికిన ప్లేయర్ టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.
Advertisement
ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ టీ-20 బ్యాట్స్ మేన్ గా కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ కూడా డివిలీయర్స్ మాదిరిగా మైదానంలో అన్ని వైపులా భారీ షాట్లను ఆడుతున్నాడు. అయితే చాలా మంది వీరిద్దరి మధ్య ఉన్న పోలికలు తీసుకొస్తున్నారు. తాజాగా దీనిపై డివిలీయర్స్ స్పందించారు. సూర్యకుమార్ ఆటతీరును తెగ మెచ్చుకున్నాడు తాను ఆడని ఎన్నో షాట్లు సూర్య ఆడుతున్నాడని.. అతని వద్ద చాలా రకాల షాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తాను ఆడే సమయంలో కనీసం అటెంప్ట్ చేయని షాట్లు కూడా సూర్యకుమార్ ఆడేస్తున్నాడు. మంచి ఫ్లోలో ఆడుతుండగా సూర్య ఆట చూడటం చెప్పుకోలేని ఆనందాన్ని ఇస్తుందని డివిలీయర్స్ చెప్పుకొచ్చాడు.
Advertisement
ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు క్రీజులో చాలా నిదానంగా మూవ్ అవుతూ అనుకున్న షాట్ ఆడేందుకు పర్ ఫెక్ట్ గా రెడీ అవుతాడని కొనియాడారు. ఒక్కోసారి ఈ విషయం అర్థం చేసుకుంటే చాలు. బౌలర్ వేగం పెరిగే కొద్ది అంత లేటుగా ఆడాలని బ్యాటర్ కి అర్థం అయితే అతడిని ఆపడం చాలా కష్టమే. సూర్య విషయంలో అదే జరుగుతుందని.. అతను ఆ కోడ్ బ్రేక్ చేశాడు అని తెలిపాడు డివిలీయర్స్. ప్రస్తుతం టీ-20లలో నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. 46 టీ20 ఇన్నింగ్స్ లో 175.76 స్ట్రైక్ రేట్ తో చెలరేగాడు. వీటిలో 13 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ICC : వరల్డ్ కప్ షెడ్యూల్లో టీమిండియాకు అన్యాయం! ఐసీసీ కావాలనే చేసిందా?