వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. భారత్ వేదికగా ఈసారి ప్రపంచ కప్ జరగనుంది. ఈ ఐసీసీ ఈవెంట్ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగియనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ వర్గాలు ఇప్పటినుంచే ఫేవరెట్ లపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ సారధి 1983 ప్రపంచ కప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వాక్యాలు చేశాడు. ఈసారి ఫేవరెట్ లలో టీమిండియా ముందుంది. అయితే ఆస్ట్రేలియా జట్టును అంత తక్కువగా అంచనా వేయలేము. వారు కూడా అద్భుతంగా ఆడుతున్నారు.
Advertisement
మరోవైపు ఇంగ్లాండ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ఆస్ట్రేలియన్ ప్లేయర్లకు మన టీమిండియాలో కూడా బాగా ఆడగల సత్తా ఉందని కూడా క్రీడా విశ్లేషకులు చెప్పడం ఇక్కడ గమనార్హం. ఈసారి టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ మూడు జట్లలో ఒక జట్టు కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందనే శ్రీకాంత్ అంచనా వేసుకున్నారు. టీమిండియాకు సొంత గడ్డపై ఆడడం సానుకూల అంశమని… ఇంగ్లాండ్ తో పోలిస్తే ఆసీస్ కు భారత్ లో టోర్నీ ఉండడం మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు.
Advertisement
కాగా, ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఐదు సార్లు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలవగా…ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఈసారి బరిలోకి దిగనుంది. ఇక 1983లో కపిల్ దేవ్ భారత్ కు తొలిసారిగా ప్రపంచ కప్ అందించగా… 2011లో మహేంద్రసింగ్ ధోని రెండవసారి వన్డే వరల్డ్ కప్ బహుమతి గెలిచిన విషయం తెలిసిందే. ఈసారి రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా స్వదేశంలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు
Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?
Asian Games : టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్!