Home » Chiranjeevi: పెద్ద కూతురు సుష్మితకు చిరంజీవి ఎందుకంత అన్యాయం చేస్తున్నాడు?

Chiranjeevi: పెద్ద కూతురు సుష్మితకు చిరంజీవి ఎందుకంత అన్యాయం చేస్తున్నాడు?

by Bunty
Ad

మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మెగా కుటుంబం నుంచి మొదటగా చిరంజీవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి… ఆ తర్వాత తన కుటుంబం నుంచి చాలామంది వ్యక్తులను హీరోలుగా పరిచయం చేశాడు. కానీ హీరోయిన్స్ గా మాత్రం అమ్మాయిలని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు చిరంజీవి. నిహారికను హీరోయిన్ గా పరిచయం చేసినప్పటికీ… అంతగా సక్సెస్ కాలేకపోయింది. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారు.

Advertisement

ఇక నిహారిక పలు వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లలో నటిస్తూ స్టూడియోను కూడా రన్ చేస్తున్నారు నిహారిక. ఇక చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మితను హీరోయిన్గా పరిచయం చేద్దామని అనుకున్నారట. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ కు జంటగా సుస్మితను అనుకున్నారట. అంతా ఓకే అనుకున్నాక స్టూడియో కూడా రెడీ చేశాక… సెకండ్ హాఫ్ నచ్చలేదని చిరంజీవి సినిమాను క్యాన్సిల్ చేశాడట. ఇక షూటింగ్ మొదలుకాకముందే ఆ సినిమా ఆగిపోయింది.

Advertisement

ఇలా చాలాసార్లు పరిచయం చేయాలని అనుకున్నప్పటికీ అనివార్య కారణాలవల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక సుస్మిత హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా కంటిన్యూ అవుతున్నారు. ఇండస్ట్రీలో నిర్మాతగా రాణించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సుస్మిత పలు వెబ్ సిరీస్ లు, రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. కానీ అవి పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. ఇక ఏకంగా సుష్మిత తన తండ్రిని హీరోగా పెట్టి భారీ బడ్జెట్ తో ఒక సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇవి కూడా చదవండి

Samajavaragamana Review : ”సామజవరగమన” మూవీ రివ్యూ

Spy Movie Review : ‘స్పై’ మూవీ రివ్యూ..నిఖిల్ ఖాతాలో మరో హిట్ ?

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Visitors Are Also Reading