టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియా జట్టుకు ఏకంగా మూడు ఐసీసీ టోర్నమెంటును అందించిన ఘనత కేవలం ధోనికి మాత్రమే దక్కుతుంది. 2007 సంవత్సరంలో జరిగిన టి20 వరల్డ్ కప్, 2011 సంవత్సరంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ అలాగే, 2013లో ఛాంపియన్ ట్రోఫీని టీమిండియా కు అందించాడు మహేంద్ర సింగ్ ధోని.
ఇక ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అటు ఆ జట్టుకు కూడా ఐదు ఐపిఎల్ టోర్నీలను అందించిన ఘనత ధోని ఖాతాలో ఉంది. ఇది ఇలా ఉండగా… తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన భార్య సాక్షితో మహేంద్రసింగ్ ధోని ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నాడు. ఈ సందర్భంగా.. మహేంద్రసింగ్ ధోని క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నాడు. ఈ తరుణంలోనే ఎయిర్ హోస్టర్స్… ధోని వద్దకు చాక్లెట్లు తీసుకువచ్చారు.
Advertisement
Advertisement
ఈ తరుణంలోనే… తన ట్యాబ్ లో ఆడుతున్న క్యాండీ క్రష్ గేమ్ ను… ఆపేసి వారిచ్చిన చాక్లెట్లను తీసుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో…. క్యాండీ క్రష్ గేమ్ ను చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారట. తమ అభిమాన క్రికెటర్ ధోని ఆ గేమ్ ఆడుతున్నాడని… అందుకే ధోని ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారట. కేవలం మూడు గంటల్లోనే 3.6 మిలియన్స్ ఈ గేమ్ ను డౌన్లోడ్ చేసుకున్నారట. దీంతో ఆ కంపెనీకి భారీగా లాభాలు వచ్చినట్లు సమాచారం అందుతుంది.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో వరల్డ్ కప్ మ్యాచులు పెట్టకపోవడానికి కారణం ఇదే ?
Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?
వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !