పెళ్లి రెండు కుటుంబాలను దగ్గర చేస్తుంది. ఇద్దరు మనుషులను ఒక్కటి చేస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునేటప్పుడు ఎన్నో ఆచార వ్యవహారాలను పాటించాల్సి ఉంటుంది. వీటిల్లో భర్త తన భార్యకు మెట్టెలు తొడగడం కూడా ఒకటి. జీలకర్ర బెల్లం ముహూర్త సమయానికే పెట్టి, మెడలో తాళి కట్టే తంతు కూడా పూర్తి అయిన తరువాత వధువురులిద్దరిని హోమగుండం ముందు కూర్చోపెట్టి పూజలు చేయిస్తారు. అప్పుడే మేనమామ తెచ్చిన మెట్టెలని అబ్బాయి చేత అమ్మాయి కాలి వేళ్ళకి తొడిగిస్తారు.
Advertisement
పెళ్లితో ఆడవారి కట్టూ బొట్టూలో కొంత మార్పులు చోటు చేసుకుంటాయి. మట్టిగాజులు వేసుకోవడం, నుదుటి కుంకుమ, మెడలో మంగళసూత్రాలు, కాలికి మెట్టెలు ఇలా వారికి కొత్త అలంకరణ వచ్చి చేరుతుంది. అయితే, కాలికి మెట్టెలు తొడగడం వెనుక శాస్త్రీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఆడవారి గర్భధారణకు, వారు మెట్టెలు తొడిగించుకోవడం వెనుక శాస్త్రీయ పరమైన రుజువులు కూడా ఉన్నాయంటే అది అతిశయోక్తి కాదు.
Advertisement
ఆడవారి బొటన వేలు డైరెక్ట్ గా నెలకి తాకకూడదు. కాలి బొటనవేలు పక్కన వేలు కూడా స్త్రీల ఆరోగ్యానికి ఆయువు పట్టు. ఈ వేళ్ళు నేలకి తగలడం మంచిది కాదు. అందుకే, ఇటువంటి జాగ్రత్త తీసుకున్నారు. బొటన వేలు పక్కన వేలు గర్భాశయానికి సంబంధం కలిగి ఉంటుంది. మెట్టెలు పెట్టుకోవడం వలన గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడి చక్కని సంతానం కలుగుతుంది. మెట్టెల వలన ఆక్యుప్రెషర్ కలుగుతుంది. వారి ఆరోగ్యం బాగుండడం కోసమే ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చి పెట్టారు. ప్రతి సంప్రదాయాన్ని ఓల్డ్ ట్రెడిషన్ అనే పేరుతొ పక్కన పడేయకుండా, అందులో ఉండే ఆంతర్యాన్ని గ్రహించడం మేలు.
మరిన్ని ముఖ్య వార్తలు:
చంద్రయాన్-3 సక్సెస్.. భారత్‌దే ప్రపంచకప్!
పుష్ప 2 మూవీ గురించి ఈ వార్త వింటే.. మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే..!
ఈ నాలుగు చెట్ల నీడ మన ఇంటిపై అస్సలు పడకూడదు…!