Home » Kabir Duhan Singh Marriage : తొలిచూపుతోనే భార్యగా ఫిక్స్ అయ్యాను.. పెళ్లి ఫోటోలు వైరల్

Kabir Duhan Singh Marriage : తొలిచూపుతోనే భార్యగా ఫిక్స్ అయ్యాను.. పెళ్లి ఫోటోలు వైరల్

by Anji
Ad

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా నటించిన నటుడు కబీర్ దుహాన్ సింగ్ తాజా గా ఓ ఇంటివాడయ్యాడు. హర్యానాకు చెందిన సీమా చాహల్ తో ఏడడుగులు నడిచాడు. ఫరీదాబాద్ లోని ఓ హోటల్ లో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలు దగ్గర బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి ఘనంగా నిర్వహించారు. ఈ నూతన జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Advertisement

పెళ్లి సందర్భంగా కబీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ.. “జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు నా అభిమానులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఆశీర్వాదాలు అందిస్తున్నారు. మీ ఆశీర్వాదాలు నా భార్య సీమకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవితంలో నేను బెస్ట్ హీరోగా ఉండాలనుకుంటున్నాను. నేను సీమాను చూసిన తొలిచూపులోనే తనే నా భార్య అనిపించింది. నన్ను నా కుటుంబాన్ని బాగా అర్థం చేసుకోగలదని నమ్మకం నాకు కలిగింది. తను ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. నేను ఇప్పుడు ఇండస్ట్రీ తో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు అదే నిజమైంది. తనతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది ” అని చెప్పుకొచ్చాడు.

Advertisement

హర్యానాలో పుట్టి పెరిగిన కబీర్ దుహాస్ సింగ్.. తొలుత మోడల్ గా పనిచేశాడు. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించాడు. జిల్  సినిమాలో తన సత్తా చూపించి టాలీవుడ్ కి ఒక కొత్త విలన్ దొరికాడని అందరూ ఆకట్టుకునేలా చేశాడు. వేదాళం మూవీ తో కోలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టాడు. తెలుగు, తమిళం రెండు భాషల్లోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాలు చేస్తున్నాడు దుహాన్ సింగ్. సౌత్ లో విలన్ గా అదరగొడుతున్న అతను ఇటీవల వచ్చిన శకుంతల మూవీలో అసుర రాజుగా ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతము కబీర్ దుహాన్ సింగ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

విడాకుల విషయంలో సమంతదే తప్పు అని అమల తేల్చేసిందా..?

 Bholaa Shankar Teaser : హద్దుల్లేవ్.. సరిహద్దుల్లేవ్.. చిరు మాస్ డైలాగ్స్ మామూలుగా లేవుగా..!

Visitors Are Also Reading