చాణక్యుడి గురించి నేటి తరానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తరతరాలుగా ఆయన రచించిన అర్ధశాస్త్రంలోని మెళకువలను నేటికీ మనం నేర్చుకుంటున్నాం. కేవలం అర్ధ శాస్త్రం మాత్రమే కాదు బ్రతకడానికి అవసరమైన ఎన్నో జీవిత సత్యాలను కూడా చాణుక్యుడు వివరించాడు. చాణుక్యుడు చెప్పిన నీతి వాక్యాలన్నీ ప్రస్తుతం చాణక్య నీతి అన్న గ్రంధం ద్వారా నేటి తరానికి చేరుతున్నాయి.
Advertisement
అయితే.. చాణుక్యుడు లోక జ్ఞానంతో పాటు కొన్ని ఆచార వ్యవహారాల గురించి కూడా వివరం చెప్పారు. ముఖ్యంగా, మూడు పనులు చేసిన తరువాత విధిగా స్నానం చేయాలని చాణుక్యుడు చెప్పాడు. ఇంతకీ ఆయన ఏ పనులు చేసిన తరువాత స్నానం కచ్చితంగా చేయాలనీ చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన తరువాత తప్పకుండా స్నానం చేయాలి. ఎందుకంటే మరణించిన వారి శరీరంలో ఉండే బాక్టీరియాను ఎదిరించే శక్తీ మనకి ఉండదు. మనకి కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటికి వచ్చాక తప్పకుండ స్నానం చేయాలి.
Advertisement
ఒంటికి నూనె పట్టించుకున్నాక కూడా తప్పకుండ స్నానం చేయాలి. ఎందుకంటే ఒంటికి నూనెతో మర్దన చేసినప్పుడు వ్యర్ధాలు బయటకు వస్తాయి. అవి పోవాలంటే కచ్చితంగా స్నానం చేయాలి. హెయిర్ కటింగ్ చేయించుకున్న తరువాత కూడా ఇంటికి వచ్చాక స్నానం చేయాలి. హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు ఆ హెయిర్ శరీరంపై అక్కడక్కడా పడుతుంది. దీనివల్ల కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కచ్చితంగా స్నానం చేయాలి.
మరిన్ని ముఖ్య వార్తలు:
చాణక్య నీతి: ఏ విషయాలను మనం రహస్యంగా ఉంచుకోవాలి తెలుసా?
చాణక్య నీతి: ఈ 8 మందికి ఇతరుల బాధ ఎప్పటికీ అర్ధం కాదు!
చాణక్య నీతి : ఈ ముగ్గురికి అస్సలు సాయం చేయకూడదట..!!