Home » చాగంటి గారు ఒక్కో ప్రవచనానికి ఎంత తీసుకుంటారు? చాగంటి మొదటి ప్రవచనం గురించి తెలుసా? ఆ రోజు కాకినాడలో ఏమి జరిగింది?

చాగంటి గారు ఒక్కో ప్రవచనానికి ఎంత తీసుకుంటారు? చాగంటి మొదటి ప్రవచనం గురించి తెలుసా? ఆ రోజు కాకినాడలో ఏమి జరిగింది?

by Srilakshmi Bharathi
Ad

చాగంటి గారి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఎన్నో వేల ప్రవచనాలు చెప్పిన చాగంటి గారి గురించి తెలియని వారెవరూ ఉండరు. పురాణాలు చదవాలి అంటే ఆసక్తి చూపించని వారు కూడా చాగంటి ప్రవచనం అంటే ముందే వచ్చి కూర్చుంటారు. ఆయన చెప్పే ప్రవచనాలు వినసొంపుగా ఉంటాయి. ఆధ్యాత్మికత వైపుకు మనసుని మళ్లిస్తాయి. మనసుకి ప్రశాంతతను చేకూరుస్తాయి.

chaganti

Advertisement

అయితే చాగంటిగారి గురించి చాలా మందికి తెలియదు. ఆయన చాగంటి సుందర శివరావు, సుశీలమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు కోటేశ్వరరావు. ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే చాగంటి గారు ప్రవచనాల వైపుకు రావడం చాలా ఆశ్చర్యంగా జరిగింది. ఒకసారి ఆయన మాతాజీ చెప్పే ప్రవచనానికి వెళ్లారు. అక్కడ ఆవిడ భాగవతంలోని ఓ శ్లోకాన్ని చెప్పి దీని అర్ధం ఎవరైనా వివరించగలరా అని అడిగారు. వెంటనే చాగంటి గారు లేచి ఆ శ్లోకానికి అర్ధంతో పాటు, ముందు వెనుకా జరిగిన చరిత్రను కూడా వివరించి చెప్పారు.

chaganti

చాగంటిగారికి ముందు నుంచి పురాణపఠనంపై ఆసక్తి ఉంది. వాటిని ఒక్కసారి చదివినా అందులోని అర్ధాలను అవపోసన పట్టేయగల ధారణా శక్తి ఆయన సొంతం. ఆయన వివరించిన తరువాత అక్కడివారితో సహా మాతాజీ కూడా ఆశ్చర్యపోయారు. మీకు సరస్వతీ కటాక్షం ఉంది. భగవతంపై మీకు ఉన్న పట్టు అమోఘమని ప్రశంసించారు. తాను ఇంత బాగా చెప్పానా అని చాగంటిగారు కూడా ఆశ్చర్యపోయారు. అప్పటినుంచి ఎవరు పురాణంలోని విషయాలను అడిగినా విడమర్చి చెప్పడం స్టార్ట్ చేసారు.

Advertisement

chaganti

అలా ఆయన ప్రవచనాలు ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. ఓ సారి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చాగంటి గారి ప్రవచనాలకు ముగ్ధుడై, ఆయన ఆధ్యాత్మిక జ్ఞానానికి ఆశ్చర్యపడి చాగంటి గారికి ఏమైనా చేయాలనుకున్నారు. అదే విషయాన్నీ ఆయన్ని అడిగి, ఏమి కావాలో చెప్పాలని కోరారు. దానికి చాగంటి గారు నవ్వి, మీకైనా నాకైనా ఇవ్వాల్సింది ఆ పరమాత్మే. మీ సహృదయానికి ధన్యవాదాలు కానీ నాకేమి వద్దని సున్నితంగా చెప్పారు.

chaganti

ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. కేవలం భగవంతునిపై ఉన్న భక్తితోనే ఆయన తనకి ఉన్న జ్ఞానాన్ని నలుగురికీ పంచుతున్నారు. ఈరోజుకు ఆయన వద్ద నాలుగు జతల బట్టలు, నాలుగైదు పంచలు తప్ప ఇంకా ఏమి ఆస్తులు ఉండవు. ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటారు. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టరు. లేట్ పర్మిషన్లు కూడా అడగరు. కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే కాకినాడలో ఓ దేవాలయం వద్ద ప్రవచనాలు చెబుతారు. ఛానెళ్ల వారే అక్కడకు వెళ్లి రికార్డు చేసుకుంటారు.

మరిన్ని ముఖ్యమైన వార్తలు :

భార్య ప్రెగ్నెన్సీ సమయంలో భర్త చేయాల్సిన పనులు…ఆ పని తప్పా!

ఈ 4 లక్షణాలు కనుక భార్యలో ఉంటే.. భర్త పరాయి ఆడదాని స్వాధీనమైనట్లే..!

మీ భార్య గొడవ పడితే ఇలా కూల్ చేయండి !

Visitors Are Also Reading