మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అయిన సందర్భంలో స్టార్ హీరోలు సెలబ్రిటీలు అందరూ కూడా కంగ్రాట్స్ అని మెసేజ్లు పంపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారని నెట్టింట చర్చ జోరుగా సాగుతోంది. మంగళవారం నాడు మా ఇంటికి ఆడపిల్ల వచ్చిందని చిరంజీవి కూడా సంతోషిస్తూ మాట్లాడారు. ఆంజనేయస్వామి అనుగ్రహం మాకు ఉందని ఆయనను నమ్ముకున్నామని చిరు చెప్పారు.
Advertisement
ప్రముఖ గైనకాలజిస్ట్స్ అందరి సమక్షం లో ఉపాసన డెలివెరీ అయ్యింది. పండంటి బిడ్డకి జన్మనిచ్చింది ఆమె. సాధారణంగా ఏ సెలెబ్రెటీలు కూడా అప్పుడే పుట్టిన పిల్లల పిక్స్ ని సోషల్ మీడియా లో పంచుకోరు. కొన్ని నెలలు గడిస్తే కానీ పిక్స్ ని పంచుకోరు. పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు కూడా కవర్ చేసి తీసుకు వెళ్లడం మనం చాలా సందర్భాల్లో చూసాం. కానీ రామ్ చరణ్ ఉపాసన కి పుట్టిన ఆడబిడ్డని అభిమానులకు చూపిస్తారా లేదా అనే ప్రశ్న అందరిలో వున్నప్పుడే ఫొటోస్ లీక్ అయ్యాయి.
Advertisement
ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ షికార్లు కొడుతోంది. చిరంజీవి మరియు రామ్ చరణ్ పోలికలు కలిసి ఆ పాప లో ఉన్నాయని అంతా అంటున్నారు. కానీ అప్పుడే పోలికలు తెలియవు. కొంచెం పెద్ద అయ్యాక పోలికలు బయటపడతాయి. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్ లో ఉంది. ఈ రోజు మొత్తం అబ్జర్వేషన్ లో ఉంచి డిస్చార్జ్ చేస్తారు. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లంతా కూడా ఆసుపత్రికి రావడం శుభాకాంక్షలు తెలపడం చేశారు.
పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా రాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్నారు. కాకినాడ ప్రాంతంలో వివిధ వర్గాల వాళ్లని కలుస్తూ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారని తెలుస్తోంది అయితే అభిమానులు కనీసం ట్వీట్ ద్వారా విషెస్ చెప్పినా బాగుండేది అని అనుకుంటున్నారు.
Also read: