హిందూ ధర్మ పరాయణులకు గరుడ పురాణం ఎంత ముఖ్యమైనదో తెలిసిందే. ఇందులో జీవిత పరమార్ధం దాగి ఉందని పండితులు విశ్వసిస్తుంటారు. సనాతన ధర్మం విశ్వసించే వారు ఈ పురాణం మరణానంతరం మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే హిందూ ధర్మంలో అందరు గరుడ పురాణం చదవాలని చెబుతుంటారు. ఈ పురాణంలో మరణానికి ముందే మానవులకు అందే సంకేతాల గురించి చెప్పబడింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
1. తలుపు, మంటలు!
మరణ శయ్యపై ఉన్న వ్యక్తులు కాసేపట్లో మరణిస్తారనగా.. వారికి ఓ రహస్య మార్గం తాలూకు తలుపులు కనిపిస్తుంటాయి. అలాగే.. కొందరు వ్యక్తులకు తమ చుట్టూ మంటలు ఉన్నట్లు కూడా కనిపిస్తాయి.
Advertisement
2. జీవితకాల కర్మలు:
మరణానికి చేరువైన వ్యక్తి తన జీవితంలో తాను చేసిన అన్ని పనులను గుర్తు చేసుకుంటాడు. తన జీవితంలో చేదు జ్ఞాపకాలను, తాను చేసిన చెడు పనులను ఎంత వద్దు అనుకున్నా గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. వాటి గురించి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఉంటాడు.
3. యమదూతలు కనిపిస్తారు:
మరణానికి దగ్గర పడ్డ వ్యక్తులకు యమదూతలు కనిపిస్తారు. మరణానికి కొన్ని రోజుల ముందు నుంచే వారి చుట్టూ ఏదో ప్రతి కూల శక్తీ వస్తున్నట్లు వారు భావిస్తుంటారు. అందుకే భయపడుతూ ఉంటారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
బిల్వ ఆకుని ఇలా వాడితే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఎలానో చూడండి!
ఆ 2 రోజుల్లో పొరపాటున కూడా నల్లని దుస్తులు వేసుకోకండి.. ఎందుకంటే?
ఆషాడ మాసంలో నవ దంపతులను ఎందుకు దూరం పెడతారో తెలుసా..?