ఆచార్య చాణక్యుడు నీతి సూత్రాలు నేటి వరకు కూడా మానవ జాతికి మార్గదర్శకంగా ఉన్నాయి. ఎన్నో శాస్త్రాల గురించి అవగాహన ఉన్న చాణక్యుడు స్త్రీ మూర్తిలో ఉండకూడనటువంటి కొన్ని లక్షణాల గురించి ప్రస్తావించాడు. ఎందుకంటే స్త్రీతోనే సృష్టి.. స్త్రీతోనే వినాశనం అంటారు మన పెద్దలు. ఈ నేపథ్యంలో స్త్రీలో ఏయే లక్షనాలు ఉండకూడదని ఆచార్యుడు చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
అహంకారం :
కొందరూ స్త్రీలు చాలా వినయంగా ఉంటారు. అలాంటి వారి కారణంగా పుట్టినిల్లు, మెట్టినిల్లు సిరిసంపదలతో విలసిల్లుతుంది. కానీ కొందరిలో మాత్రం అహంకారం ఉంటుంది. వారికే కాదు.. వారి బంధువులకు కూడా ప్రమాదమే. స్త్రీలోని అహంకారం వినాశానానికి దారి తీస్తుంది. స్త్రీలకు అహంకారం ఉండటం అస్సలు మంచిది కాదు.
అత్యాశ :
దురాశ దు:ఖానికి చేటు అనే విషయం దాదాపు అందరికీ తెలుసే. దీనిపై పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. అయితే సంతృప్తి లేని స్త్రీ ఎప్పుడూ అశాంతి, ఆందోళనతో జీవిస్తుంది. దీని ఫలితంగా నిత్యం తన భాగస్వామి పిల్లలతో కోపంగానే ఉంటుంది. ఆమె ప్రతీ రోజూ ఒత్తిడితోనే ఉంటుంది. తన కుంటుంబం పురోగతిని సాధింలేదు.
Advertisement
ఆధారపడటం :
స్త్రీ ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడితేనే మంచిది అని ఆచార్యుడు చెప్పాడు. స్త్రీ స్వతంత్రంగా ఉంటే.. తన పిల్లల జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుందని.. వారి చదువులకు ఎలాంటి ఆటంకాలు కలుగవని అభిప్రాయపడ్డాడు ఆచార్యుడు.
కోపం :
స్త్రీలకు కోపం ఉండటం సహజమే. తనకు కాకుండా తాను వెళ్లిన కుటుంబానికి కూడా మంచిది కాదని చాణక్యుడు చెప్పాడు. కోపంతో ఉన్న మహిళ ఇతరుల స్నేహాన్ని ఎన్నటికి పొందలేదు. ఇతరులతో ఉన్న సత్సంబంధాలు నశించడమే కాదు.. బంధువర్గాల్లో లేనిపోని గొడవలకు కూడా దారి తీస్తుంది. స్త్రీలు కోపం లేకుండా శాంతమైన స్వభావాన్ని కలిగి ఉండటం మంచిది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Chanakya Niti : ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని ఇంటి దరిదాపులకు కూడా రానివ్వకండి..!