ఏ భార్యా తన భర్తతో మరొక అమ్మాయి చనువుగా ఉండడాన్ని, మాట్లాడడాన్ని సహించలేదు. భర్త మరో అమ్మాయితో సన్నిహితంగా మెలిగితే తట్టుకోలేదు. భర్త మరో అమ్మాయితో ఏకంగా సంబంధం పెట్టుకుంటే ఏ భార్యా భరించలేదు. భార్యకు అనుమానాలు కూడా ఎక్కువ అవుతాయి. అసలు భార్యతో కాకుండా ఏ మగాడు అయినా మరో అమ్మాయితో ఎందుకు సంబంధం పెట్టుకుంటాడు? దీనికి మూడు ముఖ్య విషయాలు కారణాలుగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
1. ఎప్పుడు చూసినా గొడవ పడడం:
భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కానీ ఎప్పుడు చూసినా గొడవలు పెట్టుకునే భార్య అంటే భర్తకు విముఖత ఏర్పడుతుంది. అన్నిసార్లు సర్దుకోలేకపోయినా, కనీసం కొన్నిసార్లైనా గొడవ రాకుండా చూసుకోవడం అవసరం. గొడవలు ఎక్కువగా అవుతుండడం వల్ల కూడా భర్తలు పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకుంటారట.
Advertisement
2. ఆఫీస్ టెన్షన్ ఇంట్లో చూపడం:
చాలా మంది భర్తలు చేసే తప్పు ఆఫీస్ లో ఉండే టెన్షన్స్ ను ఇంట్లో చూపిస్తుంటారు. దీనివల్ల భార్యలకు భర్తల పట్ల చిరాకు, కోపం వంటి భావాలు కలుగుతాయి. దీనివల్ల కూడా మనస్పర్థలు వచ్చి భర్తలు బయట సంబంధాల వైపు చూసేలా ప్రేరేపిస్తాయి.
3. అర్ధం చేసుకోకపోవడం:
కొన్ని కొన్నిసార్లు చెప్పే విషయాలను అర్ధం చేసుకోకపోవడం వలన కూడా భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడుతాయి. వీటివలన కూడా దూరం పెరిగి అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపుతుంటారు.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చదవండి !