మనదేశంలో ఈ మధ్యకాలంలో… నోట్ల రద్దు అనే పదం రెగ్యులర్ గా వింటున్నాం. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత… నోట్ల రద్దు పదానికి బాగా పాపులారిటీ వచ్చింది. 2016లో 1000 మరియు 500 నోట్లను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు పేద ప్రజలు. వేల సంఖ్యలో బ్యాంకుల ముందు క్యూ కట్టి.. టార్చర్ అనుభవించారు సాధారణ ప్రజలు. అయితే ఈ బాధ మరిచిపోక ముందే మరోసారి నోట్లో రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం.
Advertisement
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. మే 19వ తేదీన ఈ ప్రకటన అధికారికంగా వచ్చింది. ఈ 2000 నోట్లను మే 23 నుంచి సెప్టెంబర్ 25 వరకు మార్చుకోవచ్చును. అయితే 2000 రూపాయల నోటు రద్దు అనే పదం వాడకుండా… ఉపసంహరణ అనే పదాన్ని వాడి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. ఇది ఇలా ఉండగా, ఈ ప్రకటన రావడంతోనే 2000 నోట్లను బ్యాంకులలో జమ చేస్తున్నారు ఖాతాదారులు. ఈ తరుణంలోనే బ్యాంకులకు చేరిన 2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
రిజర్వ్ బ్యాంక్ కు వచ్చిన 2000 నోట్లను మొదటగా తమ ఉప కార్యాలయాలకు పంపిస్తారు. అక్కడ చినిగిన, పాడైన 2000 రూపాయల నోట్లను చించి వేస్తారు. లేదా మిషన్లో వేసి కట్ చేస్తారు. అలా కట్ చేసిన తుక్కును… వేరే నోట్ల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే రిజర్వ్ బ్యాంకుకు వచ్చిన నోట్లను నకిలీవా, లేదా ఒరిజినల్ వా అనేది కూడా చెక్ చేస్తారు. ఒకవేళ డూప్లికేట్ అయితే… అవి బయట పారేస్తారు.
ఇవి కూడా చదవండి :
అశ్విన్ లీలలు.. బయటపెట్టిన స్టార్ స్పిన్నర్ భార్య !
ఫోన్‌లో ఈ చిన్న రంధ్రం ఎందుకు పెట్టారు ? దీని ఉపయోగం ఏంటి ?
వేణుమాధవ్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా రాజమౌళి పనిచేసాడని మీకు తెలుసా ?