Home » అక్క ప్రేమించలేదని…తమ్మున్ని చంపిన ప్రియుడు

అక్క ప్రేమించలేదని…తమ్మున్ని చంపిన ప్రియుడు

by Bunty
Ad

 

తెలంగాణ రాష్ట్రంలో వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమ పేరుతో… క్రైమ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, కొమురం భీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్క ప్రేమించలేదని సోదరుడిని హత్య చేశాడు ఓ కసాయి. తల్లి ఫిర్యాదుతో పూడ్చిన మృత దేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం చేయించారు కొమురం భీం జిల్లా పోలీసులు. తిర్యాణి మండలం ఉల్లిపిట్ట గ్రామంలో ఈ దారుణం జరిగింది.

Advertisement

ఆలస్యంగా వెలుగులోకి హత్యోదంతం బయటకు వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… ఉదయ్ కిరణ్(14) ను అదే గ్రామానికి చెందిన తరుణ్ , నరుణ్ లు కలిసి చంపినట్టుగా అనుమానం తో బాలుడి తల్లి పోలీసుల కు పిర్యాదు చేసింది. 12 రోజుల క్రితం పూడ్చిన శ***న్ని బయటికి తీసి వైద్యలు, రెవెన్యూ సమక్షం లో పోస్టుమార్టం పూర్తి చేశారు పోలీసులు. ఉదయ్ కిరణ్ సోదరి ని ప్రేమిస్తున్నానని అదే గ్రామానికి చెందిన తరుణ్…వెంటపడ్డాడు. ఆమె ప్రేమించక పోవడం తో గొంతు నులిమి హ*** చేసినట్టు గా ప్రాధమిక నిర్ధారణ కు వచ్చారు పోలీసులు.

Advertisement

ఈ నెల 1 వ తేదీన ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ప్రాణాలు కోల్పోయి ఉదయ్ కిరణ్ దర్శనమిచ్చాడు. ఎండ దెబ్బ కొట్టి చనిపోయాడు ఏమో అని భావించి పూడ్చి పెట్టారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత హ**” చేసినట్టుగా విషయం బయటకు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది మృతుడి తల్లి. తల్లి ఫిర్యాదుతో పూడ్చిన మృత దేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం చేయించారు కొమురం భీం జిల్లా పోలీసులు. ముందు అసలు విషయం బయటికి వచ్చింది. ఇక ఈ సంఘటనపై… ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Visitors Are Also Reading