Home » రేణు దేశాయ్‌ – పవన్ కళ్యాణ్ విడిపోవడానికి నాగబాబు కారణమా?

రేణు దేశాయ్‌ – పవన్ కళ్యాణ్ విడిపోవడానికి నాగబాబు కారణమా?

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉండరు. ఇటు సినిమాలతో, అటు రాజకీయాలతో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంపై ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు ఈ విషయంపై రచ్చ చేస్తూనే ఉంటారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా తనదైన స్టైల్ లో స్పందిస్తూనే ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్ధలు వల్ల విడిపోయారు. వీరిద్దరిదీ చాలా చక్కనైన జంట.

Advertisement

అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియవు. చాలా సంతోషంగా ఉంటున్న వీరి మధ్య గొడవలు జరిగి విడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ వారి పిల్లలతో చాలా సంతోషంగా ఉండేవారు. అయితే 2010 నాగబాబు తీసిన ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అవడంతో అప్పులపాలు అయ్యారు నాగబాబు. ఆ అప్పులతో సతమతమవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ తన వంతుగా కొంత డబ్బును ఇచ్చి నాగబాబు అప్పులు తీర్చారు. ఆ సమయంలో రేణు దేశాయికి కోపం వచ్చి అన్నదమ్ములకి సహాయం చేయడంలో తప్పులేదు. సహాయం చేయాలి కానీ ఎంతో కొంత మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా దాచుకోవాలి కదా.

Advertisement

ఎప్పుడు ఎవరికో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటావు అని గొడవ పెట్టుకుందట. ఆ తర్వాత నాగబాబు కొన్ని రోజులకి పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేశారట. కానీ వారిద్దరి మధ్య మాత్రం గొడవ అంతటితో ఆగకుండా రోజురోజుకు పెరుగుతూనే వచ్చిందట. ఇక కొన్ని రోజులకి వారిద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం పవన్ కళ్యాణ్ అన్నా లేజీనావోను వివాహం చేసుకున్నాడు. ఇక రేణు దేశాయ్ కూడా వివాహం చేసుకోవాలని అనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద రచ్చ చేశారు. దీంతో రేణు దేశాయ్ మరో వివాహం చేసుకోకుండా పిల్లలతోనే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక రేణు దేశాయ్ పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో

అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?

4 గురు పెళ్ళాలు ఉన్నా… ఒంటరోడే నా దేవుడు – శ్రీ రెడ్డి

Visitors Are Also Reading