ఐపీఎల్ 2023 మే చివరి వారంలో పూర్తయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2023 పూర్తి కాగానే టీమిండియా నేరుగా ఇంగ్లాండ్ పయనమైంది. ఇక అక్కడ ఆస్ట్రేలియా తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. ఇప్పటికే ఈ టెస్టు రెండు రోజులు పూర్తయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పై ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆధిపత్యం కనబరిచారు. ఇక ఇది ఇలా ఉండగా ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనంతరం… వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా పయనం కానుంది.
Advertisement
ఈ పర్యటనలో వెస్టిండీస్ తో… ఐదు టి20 లు, 3 వన్డే మ్యాచ్లు అలాగే రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనునుంది. ఇక వెస్టిండీస్ టూర్ కు సీనియర్లు అందరూ దూరం కానున్నారు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ మరియు మహమ్మద్ షమ్మీలు ఈ టోర్నీకి దూరం కానున్నట్లు సమాచారం అందుతుంది. రోహిత్ శర్మ దూరం కావడంతో టీమిండియా పగ్గాలు మరోసారి హార్దిక్ పాండ్యా కు అప్పగించనుంది బీసీసీఐ. ఇక అటు డిప్యూటీ కెప్టెన్ గా 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నారు.
Advertisement
అయితే సీనియర్లు ఈ టోర్నీకి దూరం కావడంతో ఐపీఎల్ 2023 టోర్నీలో మెరిసిన యువ ప్లేయర్లకు అవకాశం కల్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది. కోల్కత్తా బ్యాట్స్మెన్ రింకు సింగ్, రాజస్థాన్ డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ లాంటి ప్లేయర్లకు ఈ టూర్ లో అవకాశం ఇచ్చేందుకు బిసిసిఐ పెద్దలు ప్లాన్ వేస్తున్నారట. అలాగే ఈ ఏడాది ఐపిఎల్ లో మెరిసిన మోహిత్ శర్మకు కూడా ఛాన్స్ ఇచ్చేందుకు బీసీసీఐ ట్రై చేస్తుందట. వచ్చే సంవత్సరం టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో… యూత్ కు ఎక్కువగా చాన్సులు ఇచ్చేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది ?
మర్యాద రామన్న మూవీ హీరోయిన్ సలోని ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?
వెంకటేష్ – రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా ?