సాధారణంగా నెయిల్ కట్టర్ ప్రధానంగా గోర్లు కత్తిరించడానికి ఉపయోగిస్తారు. కొన్ని నెయిల్ కట్టర్లు రెండు కత్తి లాంటి ఉపకరణాలతో వస్తాయి. చాలా మందికి దాని సరైన పనితీరు లేదా ఉపయోగం తెలియదు. దానిని ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : దాల్చిన చెక్కతో అద్భుతమైన ప్రయోజనాలు.. పరిమితి దాటితే ప్రమాదం తప్పదు..!
Advertisement
గోర్లు కత్తిరించడానికి మాత్రమే నెయిల్ కట్టర్లను ఉపయోగిస్తారు. కానీ దీంతో మనిషికి ఎలాంటి ఉపయోగముండదు కాబట్టి దాని యుటిలిటినీ పెంచేందుకు రెండు కత్తిలాంటి పరికరాలను జత చేస్తారు. దీంతో గోర్లను కత్తిరించడమే కాకుండా.. ఇతర పనులకు ఉపయోగించవచ్చు. చాలా మంది కత్తులు మన గోళ్లను శుభ్రం చేసుకోవడానికి ఇచ్చారనుకుంటారు. అసలు దాని సరైన ఉపయోగమేంటి ? కానీ అది కాదు.. వాస్తవానికి రెండు బ్లేడ్ లను జోడించిన తరువాత నెయిల్ కట్టర్ యుటిలిటీ చాలా పెరిగింది.
Advertisement
మీరు బయటికి వెళ్లినప్పుడు బాటిల్ క్యాప్ తెరవాలంటే నెయిల్ కట్టర్ ఉపయోగించండి. నెయిల్ కట్టర్ లో చిన్న వంగిన కత్తి ఉంటుంది. దాని సహాయంతో బాటిల్ క్యాప్ తీయవచ్చు. ఏదైనా పర్యటనలో ఉన్న సమయంలో చిన్న కత్తి నిమ్మకాయలు, నారింజ ఇలా ఏదైనా చాలా సులభంగా కత్తిరించవచ్చు. కొందరూ వ్యక్తులు గోర్లలో ఉన్న మురికిని శుభ్రం చేయడానికి కత్తుల పదునైన చివరలను ఉపయోగిస్తారు. అలా చేయడం మంచిది కాదు. కొంచెం పొరపాటుంటే. దాని పదునైన అంచులు మీ వేలికి గుచ్చవచ్చు. మీకు గాయాలు కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించడం చాలా బెటర్.
Also Read : వెంకటేష్, నానితో సుధీర్ బాబు పోటీ పడనున్నారా ?