వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు వైయస్సార్సీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. మా సొంత పార్టీ వారే ఎక్కడో అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ తో, తెలంగాణలో ఉన్న గోనె ప్రకాష్ రావుతో నన్ను తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయకపోయినా నాపై, నా కొడుకు పై ఆరోపణలు చేయడం భరించలేకపోతున్నాను.
READ ALSO : The Kerala Story Movie Review : ది కేరళ స్టోరీ రివ్యూ… వివాదాలకు కేరాఫ్ అడ్రస్
Advertisement
చాలా బాధపడుతున్నానని… నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం అభిమానుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని పేర్కొన్నారు. 1987 నుంచి యూత్ కాంగ్రెస్ లో ఉంటూ విలువలతో కూడిన రాజకీయం చేశాను. 1999 లో వైఎస్ దీక్షతో ఎమ్మెల్యే పదవి దక్కింది. ఆ తర్వాత 2009లో వైఎస్ చలవ వల్ల మంత్రి అయ్యాను. వైయస్ మరణాంతరం వైయస్ జగన్ కోసం మంత్రి పదవి వదులుకొని వచ్చానని వెల్లడించారు.
Advertisement
READ ALSO : X, Y, Z, Z+ కేటగిరి భద్రత అంటే ఏంటి? ఎవరికి ఈ భద్రత కల్పిస్తారు.
గోనే ప్రకాష్ రావు… జగన్ ను, విజయమ్మను విమర్శిస్తాడు. వైవి సుబ్బారెడ్డిని పొగుడుతాడు. ఇదేమి రాజకీయం అని ఫైర్ అయ్యారు. పార్టీలో నేను చేసిన తప్పేంటి. ఏం తప్పు చేశానో చెప్పండి. రాజకీయాలు మానుకుంటాను… నేను పడుతున్న ఇబ్బందులు, నాపై వస్తున్న ఆరోపణలతో నా చావేదో నేను చస్తాను కానీ, కార్యకర్తలకు ఇబ్బంది కలిగించే పనులు చేయనని వివరించారు బాలినేని.
READ ALSO : “వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!