Home » ల‌వ‌ర్ బర్త్ డే అని కేక్ తెచ్చాడు….కానీ మ‌రో యువ‌కుడితో చాటింగ్ చేస్తుంద‌ని ఏం చేశాడంటే..?

ల‌వ‌ర్ బర్త్ డే అని కేక్ తెచ్చాడు….కానీ మ‌రో యువ‌కుడితో చాటింగ్ చేస్తుంద‌ని ఏం చేశాడంటే..?

by AJAY
Ad

చిన్న చిన్న కార‌ణాల‌తో ప్రేమించిన‌వారిపైనే దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. క్ష‌ణికావేశంలో త‌మ భ‌విష్య‌త్ తో పాటూ తాము ప్రేమించిన‌వారి జీవితాల‌ను కూడా నాశ‌నం చేస్తున్నారు.తాజాగా బెంగుళూరులో అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ప్రేమించిన వాడే ఆమె పాలిట య‌ముడ‌య్యాడు. పుట్టిన‌రోజు అంటూ కేక్ తీసుకువ‌చ్చి ఆ క‌త్తితోనే ఆమె గొంతుకోశాడు. కేవ‌లం అనుమానంతోనే ఈ ప‌నిచేశాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

బెంగుళూరులో సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే…నవ్య అనే 24 ఏళ్ల యువ‌తి దూర‌పు బంధువు అయిన ప్ర‌శాంత్ తో ఆరేళ్లుగా ప్రేమ‌లో ఉంది. వీరిద్ద‌రూ ప్రేమించుకుంటున్న విష‌యం పెద్ద‌ల‌కు కూడా తెలుసు. మంచి స‌మ‌యం చూసి ఇద్ద‌రికీ పెళ్లి చేయాల‌ని కూడా వాళ్లు నిర్న‌యించుకున్నారు. కాగా ఈ మంగ‌ళ‌వారం నవ్య పుట్టిన రోజు జ‌రిగింది.

Advertisement

ప్ర‌శాంత్ ను కూడా పుట్టిన రోజుకు ఆహ్వానించగా తాను బిజీగా ఉన్నాన‌ని చెప్పి దూరంగా ఉండిపోయాడు. కాగా గురువారం ప్ర‌శాంత్ కేక్ తో వ‌చ్చి నవ్య‌కు స‌ర్ప్రైజ్ ఇచ్చాడు. న‌వ్య ఇంట్లోనే పుట్టిన రోజు వేడుక‌ను నిర్వ‌హించాడు. కాసేపు ఇద్ద‌రూ క‌బుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గ‌డిపారు కూడా. అయితే ఇంత‌లోనే త‌న వద్ద ఉన్న కత్తితో ప్ర‌శాంత్ న‌వ్య గొంతు కోశాడు. అనంత‌రం అక్కడ నుండి ప‌రార్ అయ్యాడు.

దాంతో పోలీసులు నింధితుడిని ప‌ట్టుకుని త‌మ స్టైల్ లో విచారించారు. దాంతో న‌వ్య ఎవ‌రితోనో చాటింగ్ చేస్తుంది అన్న అనుమానం తోనే ప్ర‌శాంత్ దారుణానికి పాల్ప‌డిన‌ట్టుగా పోలీసులు వెల్ల‌డించాడు. చాలా రొజుల నుండి ఇద్ద‌రి మ‌ధ్య ఆ విష‌యంలో గొడ‌వ‌లు కూడా జ‌రుగుతున్నాయ‌ని ఆమె తీరులో ఎలాంటి మార్పు రాలేద‌ని ఆరోపించాడు.

ALSO READ :5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!

Visitors Are Also Reading