బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అంటే తెలియని వారు ఉండరు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ప్రెగ్నెంట్ అయి సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. ఆ తర్వాత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చి తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. అలాంటి ఆలియా భట్ టైం దొరికినప్పుడల్లా తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటుంది. ఓవైపు కపూర్ ఇంటి కోడలిగా , మరోవైపు తన బిడ్డకు తల్లిగా, ఇంకోవైపు నటిగా తన కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ ఎంతో కష్టపడుతోంది.
Advertisement
Also Read:“భైరవద్వీపం” లో బాలయ్య “కురూపి” వేషధారణకి చూపించిన డెడికేషన్ చూస్తే దణ్ణం పెట్టాల్సిందే..!
అలాంటి ఆమెలో ఒక గొప్ప క్రియేటర్ ఉన్నాడని , తనకు బుక్ రాసే అలవాటు లేకపోయినా కానీ తన ఆలోచనలను తన చెల్లి ద్వారా ఒక బుక్ లో ఏదో ఒక రోజు రాయిస్తానని శపథం చేసింది. అంతేకాకుండా తాను ఒక పుస్తకాల పురుగునని, ఖాళీ సమయం దొరికితే పుస్తకాల వెంటపడతానని తెలియజేసింది. అలియా భట్ ఆదివారం వస్తే చాలు ఇల్లు విడిచి బయటకు రాదట. ఇంట్లో ఉండి పుస్తకాలు చదువుతూ ఉంటుందట. ముఖ్యంగా అందులో నీతి కథలు దొరికితే అస్సలు విడిచి పెట్టదట. పుస్తకం కంప్లీట్ అయ్యేవరకు ఓపికగా మనసుపెట్టి చదువుతున్నట్టు తెలియజేసింది.
Advertisement
Also Read:ఉపాసన కోసం మెగాస్టార్ మదర్ స్పెషల్ వంటకం..ఇంతకంటే ఏం కావాలి..!
ఆమె ఇంత ఆసక్తిగా చదవడానికి మరో కారణం కూడా ఉందని చెప్పుకొచ్చింది. ఈ నీతి కథలు తన కుమార్తె పెద్దయిన తర్వాత వినిపించాలని, మనం ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే పిల్లలు ఆ విధంగానే పెరుగుతారని చెప్పుకొచ్చింది. ఈ పుస్తకాలకు సంబంధించి కొన్నింటిని తన ఇన్స్టా ఖాతాలో కూడా పోస్ట్ చేసింది. తన కుమార్తెకు సంబంధించి పూర్తి బాధ్యతలను తానే చూసుకుంటుందని అన్నది. అలియా భట్ సినిమాల విషయానికొస్తే రన్బీర్ సింగ్ సరసన రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహానిలో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.
Also Read:సుకుమార్ భార్య బ్యాగ్రౌండ్.. ఆమె ఏ బిజినెస్ చేస్తుందో తెలిస్తే వావ్ అంటారు..!!