మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్లు పొందుతున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీ ఇంట్లోకి వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందుకోసం మెగా కుటుంబంతో పాటు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గర్భంతో ఉన్న ఉపాసనను చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. ఆమె డెలివరీ కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి గెనకాలజిస్టును తీసుకురానున్నారు.
Also Read : దివ్యభారతి నుండి ఆర్తి అగర్వాల్ వరకూ చిన్న వయసులోనే కన్నుమూసిన సెలబ్రెటీలు…మృతికి కారణాలు..?
Advertisement
తాజాగా ఉపాసన కోసం చిరంజీవి తల్లి అంజనమ్మ ఓ స్పెషల్ వంటకాన్ని తయారు చేసారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాసన కోసం అంజనా దేవి తయారు చేసిన వీడియోను మనం చూడవచ్చు. వేడి వేడి పులావ్ లో కొత్తిమీర, పుదీనాతో అలంకరించడం, ఎలా వేయాలో, ఎంత వేయాలో అంజనమ్మ చెబుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
Advertisement
Sunday Pulao made with loads of love ❤️. What more can I ask for. 🤗🤗🤗 pic.twitter.com/EegIdtsU80
— Upasana Konidela (@upasanakonidela) April 16, 2023
సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసింది ఉపాసన. ఒక స్పెషల్ నోట్ కూడా రాసుకొచ్చింది. ‘నాయనమ్మ ప్రేమతో నిండిపోయిన సండే స్పెషల్ పులావ్, ఇంతకంటే నాకేం కావాలి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. మెగా కోడలి ప్రేమకు, అంజనమ్మ కేరింగ్ కి అందరూ ఫిదా అవుతూ పలు కామెంట్స్ చేస్తున్నారు.