నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 10వ తరగతితో 1410 కానిస్టేబుల్ ఉద్యోగాలు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్).. 1,410 కానిస్టేబుల్ (ట్రేడ్ మ్యాన్) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Advertisement
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ప్లంబర్/పెయింటర్/ఎలక్ట్రీషియన్/పంప్ ఆపరేటర్/డ్రాఫ్ట్ మ్యాన్/టిన్ స్మిత్/టైలర్/కాబ్లర్/బార్బర్/మాలి/స్వీపర్/వాషర్ మ్యాన్/కుక్/వాటర్ క్యారియర్/వెయిటర్/ బట్చర్ తదితర స్పెషలైజేషన్ లో కూడా ఉండాలి.
Advertisement
అలాగే నోటిఫికేషన్లు సూచించిన విధంగా శారీరక కొలతలు కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు కచ్చితంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష/ఫిజికల్ టెస్ట్ ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతిభ కనబరిచిన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా చెల్లిస్తారు.
READ ALSO : చైతూతో ఉన్న ఆ ఒక్క తీపి గుర్తును కూడా చెరిపి వేసిన సమంత !