తెలుగు సినిమా ఇండస్ట్రీలో మధ్యతరం హీరోయిన్లలో రోజా కూడా ఒకరు. ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అలాంటి రోజా ఇండస్ట్రీలో ఎంత పేరు సంపాదించుకుందో అంత మంచి మనసు కలిగిన నటి అని చెప్పవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఈమె సొంతం. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిన బుల్లితెర షోల ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది.
Advertisement
ప్రస్తుతం రోజా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవి రావడంతో సినిమాలకు మరియు బుల్లితెర షోలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రజాసేవలో ముందుకు పోతోంది. అయితే తాజాగా మంత్రి రోజాకు మరో పదవి దక్కింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రోజాకు అవకాశం లభించింది. సాయ్ పాలకవర్గ సభ్యురాలుగా మంత్రి ఆర్కే రోజా నియమితులయ్యారు. 2018 అక్టోబర్ లో నియమించిన ఈ పాలకవర్గం 2022 అక్టోబర్ వరకు అమలులో ఉంది.
Advertisement
కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి అధ్యక్షుడిగా కొనసాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యవర్గంలో సభ్యులుగా, పాలకవర్గ పునర్నియామకంలో భాగంగా సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, త్రిపుర రాష్ట్రాల కీలక శాఖ మంత్రులకు చోటు దక్కింది. రొటేషన్ పద్ధతిలో వివిధ రాష్ట్రాల మంత్రులను పాలకవర్గ సభ్యులుగా నియమిస్తున్నట్లు శాయ్ పేర్కొంది. ఐదు రాష్ట్రాల క్రీడాశాఖ మంత్రులకు అవకాశం లభించగా, మంత్రి రోజాకు పదవి ఇచ్చారు. మొత్తం ఐదు రాష్ట్రాల క్రీడాశాఖ మంత్రులకు ఈ అవకాశం కల్పించగా, అందులో ఏపీ మంత్రి కూడా ఉన్నారు.
READ ALSO : TSPSC Group-4 : గ్రూప్ 4 అభ్యర్థులకు శుభవార్త.. దరఖాస్తుల గడువు పొడగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే