చైనాలో మరోసారి ప్రపంచ దేశాలను భయపెడుతోంది కరోనా వైరస్. కరోనా వైరస్ కు జన్మనిచ్చిన దేశంలోనే మరోసారి వైరస్ వర్రీ అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. డ్రాగన్ కంట్రీలో కొత్తగా కోవిడ్ మహమ్మారి మరోసారి పంజా విసురుతుంది. కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవ్వడంతో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇటు ఇండియా లోను కొత్త వేరియంట్ అయిన బి7 ప్రవేశించింది.
Advertisement
ముఖ్యంగా పోరుగుదేశం చైనాలో కరోనా విజృంభిస్తుంది. గత 20 రోజుల్లో 248 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకి ఉండొచ్చని అంచనా. అంటే చైనా జనాభాలో దాదాపు 18 శాతం మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే డిసెంబర్ చివరి వారంలో ఒక్క రోజులోనే 3.7 కోట్లకు పైగా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చైనా ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాప్తిగా పరిణామం చెందుతుందని భావిస్తోంది.
Advertisement
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో చైనా నేషనల్ హెల్త్ కమిషన్ బుధవారం అత్యవసరంగా భేటీ అయింది. కోవిడ్ వ్యాప్తిని ఎలా అరికట్టాలన్న అంశంపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు కోవిడ్ ను కట్టడి చేసేందుకు అవలంబించిన జీరో కోవిడ్ పాలసీ వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ తగ్గి, ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు వ్యాప్తి చెందడానికి దారి తీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా వ్యాప్తిలో చిచువాన్ ప్రావిన్స్ లోని సౌత్ వెస్ట్, బీజింగ్ లో సగానికి పైగా ప్రజలు ఈ వైరస్ మారిన పడే అవకాశం ఉందని ఎన్ హెచ్ సి అంచనా వేస్తోంది. అయితే చైనా హెల్త్ రెగ్యులేటరీ ఈ అంచనాలకు ఎలా వచ్చిందన్న అంశంపై స్పష్టత కొరవడింది.
READ ALSO : విడాకుల తర్వాత సమంతకు మిగిలిన ఆస్తుల వివరాలు… ఆమె దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే!