నేడు భద్రాచలం బంద్ కు గ్రామస్థులు పిలుపునిచ్చారు. భద్రాచలాన్ని 3 పంచాయతీలుగా విభజించడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాత గ్రామపంచాయతీని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
తిరుమల దేవస్థానంలో 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 75,611 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,228 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Advertisement
నేడు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఈడీ విచారణకు హాజరుకాబోతున్నారు. ఉదయం 10.30కి ఈడీ ఆఫీసుకి రోహిత్‌రెడ్డి వెల్లనున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా నిలిచింది. పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌పై 4-2 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. దీంతో మూడోసారి ఫిఫా వరల్డ్ కప్ ను అర్జెంటీనా కైవసం చేసుకుంది.
చైనాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కేసులు పెరగటంతో పలు నగరాల్లో ఆంక్షలు విధించారు. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.
Advertisement
హైదరాబాద్ వైశాలి కిడ్నాప్ కేసులో 42కు చేరిన అరెస్టుల సంఖ్య. ఏ2 నిందితుడు రుమాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరిని ఈ కేసులో అదపులోకి తీసుకోనున్నారు.
అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని కమిటీలు ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. 43 లక్షల సభ్యత్వాలు నమోదు చేశామని అన్నారు. మోడీ, కేసీఆర్ వైఫల్యాలను ఛార్జ్‌షీట్ రూపంలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ వెళ్లేలా కార్యక్రమం తీసుకుంటున్నామన్నారు.
సీనియర్ నేతల ఆరోపణల పై సీతక్క సహనం వ్యక్తం చేశారు. పదవి ఉన్నా లేకున్నా పని చేస్తామని చెప్పారు. పదవుల కోసం రాలేదని కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్నప్పుడే పార్టీలోకి వచ్చామని చెప్పారు.
జనవరి 26 నుంచి జూన్ 2 వరకు రేవంత్ పాదయాత్రకు సిద్దమవుతున్నారు. యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. యాత్ర కోసం ఇప్పటికే టీపీసీసీ పోస్టర్ ను విడుదల చేసింది.