విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ హిందీ భాషల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నెగిటివ్ రోల్స్ తో పాటు పాజిటివ్ రోల్స్ లోనూ ప్రకాష్ రాజ్ నటిస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. ప్రకాష్ రాజ్ కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాలలోను చురుకుగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ పొలిటికల్ పార్టీని కూడా స్థాపించారు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక ప్రకాష్ రాజ్ సమయం దొరికినప్పుడల్లా బిజెపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అంతేకాకుండా ప్రకాష్ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
అయితే ఇటీవల టిఆర్ఎస్ ను జాతీయస్థాయిలో తీసుకెళ్లడం కోసం బీఆర్ఎస్ గా పేరు మార్చారు. తెలంగాణ భవన్ లో డిసెంబర్ 9న మధ్యాహ్నం కేసీఆర్ సంతకంతో టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా బీఆర్ఎస్ గా అవతరించింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
బిజెపికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న ప్రకాష్ రాజ్ ను కేసీఆర్ పక్కన చేర్చుకున్నారు. అంతే కాకుండా ప్రకాష్ రాజ్ కు బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవి ఇవ్వబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక లేదా తమిళనాడులో ప్రకాష్ ద్వారా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు కూడా చర్చమొదలైంది.