Home » న‌వీన్ రెడ్డితో వైశాలి పెళ్లి జ‌రిగిందా..? అస‌లు న‌వీన్ రెడ్డి ఎందుకు కిడ్నాప్ చేశాడు..!

న‌వీన్ రెడ్డితో వైశాలి పెళ్లి జ‌రిగిందా..? అస‌లు న‌వీన్ రెడ్డి ఎందుకు కిడ్నాప్ చేశాడు..!

by AJAY
Ad

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన యువతీ కిడ్నాప్ కేసు కరకలం రేపుతున్న‌ సంగతి తెలిసిందే. అయితే కిడ్నాప్ కు గురైన యువతి వైశాలిని పోలీసులు రక్షించి క్షేమంగా ఆమె త‌ల్లిదండ్రుల‌కు అప్పగించారు. కాగా కిడ్నాప్ గురించి వైశాలి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నవీన్ రెడ్డితో పరిచయం ఫ్రెండ్ షిప్ గురించి వెల్లడించారు. వైశాలి మాట్లాడుతూ…. నవీన్ రెడ్డితో తనకు స్నేహం మాత్రమే ఉంద‌ని తెలిపారు. నవీన్ రెడ్డిని తాను ప్రేమించలేదని అన్నారు. నవీన్ రెడ్డి తనకు ప్రపోజ్ చేశాడని…పెళ్లికి నో చెప్పడం వల్లే కిడ్నాప్ చేశాడని వైశాలి ఆరోపించారు.

Advertisement

అంతే కాకుండా కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వాళ్ళు తనతో దారుణంగా ప్రవర్తించార‌ని వైశాలి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న‌వీన్ రెడ్డి అంటే ఇష్టం లేదని… తాను అంటే ఇష్టం ఉంటే త‌న‌ పేరెంట్స్ ను అడగమని చెప్పానని అన్నారు. ఇష్టం లేదని చెబుతున్నా కూడా వినిపించుకోలేదని అన్నారు. నా ఇష్టంతో పనిలేదని సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చాడని వైశాలి తెలిపారు. తాను ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం చేయడం ప్రారంభించాడని అన్నారు. తన పేరుతో నకిలీ ఇన్ స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేశాడని అన్నారు.

Advertisement

తనకు న‌వీన్ రెడ్డితో పెళ్లి జరగలేదని పెళ్లయిందని చెప్పటం నిజం కాదని అన్నారు. తనతో పెళ్లి జరిగిందని చెబుతున్న రోజు తాను ఆర్మీ కాలేజీలో డెంటల్ ట్రీట్మెంట్ లో ఉన్నాన‌ని వైశాలి అన్నారు. పెళ్లి జరిగిందని చెప్పి ఫోటోలు మార్ఫింగ్ చేసి తన భవిష్యత్తును నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తను చెప్పినట్టు వినకుంటే తన తండ్రిని చంపేస్తాడని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. స్నేహితులు అందరం కలిసి వెళ్దాం కానీ అతడితో తాను ఎప్పుడూ సింగిల్ గా వెళ్లలేదని అన్నారు. నా కంట్రోల్ లో ఉంటేనే మీ వాళ్ళు సేఫ్ గా ఉంటారని నవీన్ రెడ్డి త‌న‌ను బెదిరించడని వైశాలి అన్నారు. తనపై పదిమంది దాడి చేసి ఇంట్లో నుండి ఎత్తుకెళ్లారని అన్నారు. తనను దారుణంగా ట్రీట్ చేశారని… నవీన్ రెడ్డి ఒక్కడే తనను కారులో ఇష్టం వచ్చినట్టు కొట్టాడని అన్నారు.

Visitors Are Also Reading