Home » Dec 5th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Dec 5th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఇవాళ, రేపు బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ నేతలు హాజ‌రుకానున్నారు.

నేడు కేఆర్ఎంబీ ఆర్ఎంసీ చివరి సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

బాపట్లలోని వేమూరు మండలం జంపని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. టాటాఏస్‌ బోల్తాపడి నలుగురు అయ్యప్ప భక్తులు కన్నుమూశారు. మరో 16 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కృష్ణా జిల్లా వాసులుగా గుర్తించారు.


తిరుమలలో 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం ప‌డుతుండ‌గా నిన్న శ్రీవారిని 80,001 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

నేడు రాయలసీమ గర్జన సభ జ‌ర‌గ‌నుంది. 3 రాజధానులకు మద్దతుగా వైసీపీ మద్దతుతో జేఏసీ ఆధ్వర్యంలో సభను నిర్వ‌హిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ స‌భ‌కు లక్షలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

Advertisement

దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్ప‌డింది. దాంతో ఈ నెల 8న తమిళనాడు, పుదుచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచన ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అదికారులు వెల్ల‌డించారు.

నేడు ఢిల్లీలో జీ-20 సన్నాహక సమావేశం జ‌ర‌నుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం జ‌ర‌గనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల అధ్యక్షులు హాజ‌రుకానున్నారు.

Ap cm jagan

Ap cm jagan

నేడు సీఏం జ‌గ‌న్ ఢిల్లీకి వెల్ల‌నున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే జీ20 సన్నాహక సమావేశంలో సీఎం పాల్గొన‌బోతున్నారు. 2023లో జీ20కి భారత్ అధ్య‌క్ష‌త వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

భారత్‌పై బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. భారత్‌పై ఒక వికెట్‌ తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. భారత్‌ స్కోర్‌ 186 ఆలౌట్ కాగా బంగ్లాదేశ్‌ స్కోర్‌ 187/9 గా ఉంది.

Visitors Are Also Reading