బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. 650 పెరిగి 47,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి 51,380కు చేరుకుంది.
Advertisement
ఓటర్ల జాబితాలో సవరణలకు ఆగస్టు 1 నుండి కొత్త మార్గ నిర్దేశకాలు అమల్లోకి రానున్నాయి. 2023 ఏప్రిల్ 1 నాటికి తమ ఆధార్ నెంబర్ తెలియజేయాలని ఇది పూర్తిగా స్వచ్ఛందమని పేర్కొన్నారు.
గురుగ్రహం ఉపరితలంపై ఈ మధ్య భారీ తుఫానులు ఏర్పడ్డాయని నాసా వెల్లడించింది. వందల కిలోమీటర్ల మేర 50 కిలోమీటర్ల ఎత్తు వరకు తుఫానులు సంభవించాయని పేర్కొంది.
నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్శిటీలో కరోనా కలకలం రేగింది. ఇప్పటి వరకు 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హాస్టల్ క్వారంటైన్ లో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.
కొల్లాపూర్ ఏల్లూరు శివారు రేగమనగడ్డ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ వన్ లో క్రేన్ సాయంతో పంపు హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైరు తెగి ఐదుగురు కార్మికుల దుర్మరణం పాలయ్యారు.మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు బీహార్ కూలీలుగా గుర్తించారు.
Advertisement
నేటి నుండి మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నాయి. మావో వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా, ఛతీస్ గడ్, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తన్నారు.
నేడు సీఎం వైఎస్ జగన్ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం మూడో విడతను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
రాజస్థాన్ బర్మర్ జిల్లాలో మిగ్-21 ఫైటర్ జెట్ కూలిపోయింది. మంటల్లో చిక్కుకుని ఇద్దరు పైలట్టు మృతిచెందారు.
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలపై ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. దాంతో జీహెచ్ఎంసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.