భారతదేశంలో ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్‌కు ఎంతో ప్రత్యేకత ఉండేది. నిజాంల కాలంలోనే హైదరాబాద్ మహనగరానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. క్రమక్రమంగా పెరుగుతూ అంచెలంచెలుగా నగరం అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది. నగరం పెరుగుతున్న కొద్ది నగరంతో పాటు వాహనాలు కూడా పెరుగుతున్నాయి.
ఈ వాహనాల నుంచి వెలువడే కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు నగర పోలీసులు ప్రత్యేక చొరువ తీసుకున్నారు. దేశంలోనే తొలి గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్‌ను హైదరాబాద్ నగరంలో నిర్మించనున్నారు. ఇక 150 ట్రాఫిక్ క్రాసింగ్‌లను పర్యావరణ రహితంగా తీర్చిదిద్దుతాం అని.. దీని కోసం గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. జంక్షన్ సిగ్నలింగ్ సిస్టమ్‌లో మార్పులు, మెరుగుదల కార్బన్‌డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులను ఆటో మొబైల్స్ ద్వారా ఉత్పన్నం అయ్యే టాక్సిన్‌లను తగ్గిస్తాయి.
ప్రస్తుతం గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్ మాత్రం బ్రెజిల్‌లోని రియో డీజనీరో, ఇజ్రాయెల్లోని హైఫాలో గూగూల్‌తో రూపకల్పన చేయబడడమే కాకుండా పరీరక్షించబడుతోంది. ఈ డేటా ఆధారంగానే సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచినట్టయితే జంక్షన్ల వాహనదారులు వేచి ఉండే సమయం కూడా తగ్గుతుంది. ఇక వారం రోజుల్లో ఇజ్రాయెల్ నగరంలోని హైఫాలో గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అడ్డంకులు 2 శాతం మేరకు తగ్గాయి. భారత్‌లోనే తొలి గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్‌ను ప్రారంభించడానికి గూగుల్‌తో ఒప్పందం కుదిరిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇటీవలే వెల్లడించారు. ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పాలి.
Also Read :
లైవ్ లో కన్నీరు పెట్టుకున్న కృతిశెట్టి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?
గోదుమలకు బదులు కర్రపెండలం తినాలని ఆదేశ అధ్యక్షుడు చెప్పారు ఎందుకో తెలుసా..?