Home » 25 ఏళ్లుగా హీరో వెంక‌టేష్ రోజా మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డాన‌కి కార‌ణం అదేనా..?

25 ఏళ్లుగా హీరో వెంక‌టేష్ రోజా మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డాన‌కి కార‌ణం అదేనా..?

by AJAY
Published: Last Updated on
Ad

ఇండ‌స్ట్రీలో కొన్ని సినిమాల వ‌ల్ల న‌టీన‌టుల మ‌ధ్య స్నేహం పెరిగితే మ‌రి కొన్ని సినిమాల వ‌ల్ల ఉన్న ఫ్రెండ్ షిప్ కూడా చెడిపోయే అవ‌కాశం ఉంటుంది. క‌లిసి ప‌నిచేసిన చోట మ‌న‌స్ప‌ర్ద‌లు గొడ‌వ‌లు స‌ర్వ‌సాధార‌ణం కానీ ఆ గొడ‌వ‌లు పెద్ద‌గా అయితేనే జీవితాంతం మాట్లాడుకోకుండా క‌లుసుకోకుండా ఉండాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అయితే అలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌టం వ‌ల్ల‌నే టాలీవుడ్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌ప్ప‌టి హీరోయిన్ ప్ర‌స్తుతం మంత్రి రోజా 25 ఏళ్లుగా మాట్లాడుకోవ‌డం లేదట‌. వీరిద్ద‌రి మ‌ధ్య అస‌లు ఏం జ‌రిగింది.

Advertisement

ఎందుకు ఇప్ప‌టికీ మాట్లాడుకోవ‌డం లేదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రోజా హీరోయిన్ గా త‌న భ‌ర్త సెల్వ‌మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ హీరోగా చిన‌రాయుడు అనే సినిమా చేయాల‌ని అనుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింద‌ట‌. అయితే అదే క‌థ‌తో విక్ట‌రీ వెంటేష్ హీరోగా విజ‌య‌శాంతి హీరోయిన్ గా సినిమా చేశారు. ఈ సినిమా విడుద‌లైన త‌ర‌వాత చూసిన రోజా వెంక‌టేష్ పై ఫైర్ అయ్యార‌ట‌. త‌న‌తో చేయాల్సిన సినిమాను విజ‌య‌శాంతితో ఎందుకు చేశారంటూ నిల‌దీసింద‌ట‌.

Advertisement

దాంతో వెంక‌టేష్ అందులో త‌న ప్ర‌మేయం ఏమీ లేద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చెప్పిందే తాను చేశాన‌ని స‌మాధానం ఇచ్చార‌ట‌. ఆ గొడ‌వ‌కు అక్క‌డితో పులిస్టాప్ ప‌డింది. ఆ త‌ర‌వాత రోజా హీరోయిన్ గా వెంక‌టేష్ హీరోగా పోకిరిరాజా అనే సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ కోసం రోజాను ముంబాయికి ర‌ప్పించి ఓ హోట‌ల్ లో ఉంచారు.

కానీ మూడు రోజులైనా షూటింగ్ కు పిల‌వ‌లేదట‌. దాంతో రోజా త‌న బ‌ర్త్ డే ఉంద‌ని చెప్పి అక్క‌డ నుండి వెళ్లిపోయింద‌ట‌. కానీ ఆ త‌వ‌రాత మ‌ళ్లీ రోజాను ముంబై పిలిపించి ఆమె పై తీయాల్సిన సీన్ల‌న్నీ తీశారు. ఈ సినిమా పూర్తైంది కానీ ఆ త‌ర‌వాత రోజా వెంక‌టేష్ తో సినిమాలు చేయ‌లేదు. అప్పటి నుండే వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌లు లేవ‌ని టాక్.

ALSO READ :

షో ఆఫ్ అవ‌స‌ర‌మా..? మంచు ల‌క్ష్మి పోస్ట్ పై నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

Visitors Are Also Reading