Home » వాన హీరోను పెళ్లాడుతున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రంటే..?

వాన హీరోను పెళ్లాడుతున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రంటే..?

by AJAY
Ad

విమ‌లా రామ‌న్‌.. మోడ‌ల్‌గా కెరీర్‌ను మొద‌లు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అన‌తికాలంలోనే హీరోయిన్‌గా మారింది. గాయం-2 ,చ‌ట్టం, ఎవ‌రైనా.. ఎప్పుడైనా చిత్రాల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన విమ‌ల మ‌ల‌యాళంలో అడుగుపెట్టి అక్క‌డ స్టార్ హోదాను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌కుదూరంగా ఉంటున్న ఈ భామ త్వ‌ర‌లోనే పెళ్లి పీటలు ఎక్క‌నున్న‌ది. తెలుగు సోల్ పుల్ ల‌వ్‌స్టోరీ గా తెర‌కెక్కిన వాన సినిమాను ఏ ఒక్క‌రూ అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు.

Advertisement


ఈ సినిమాలో హీరోగా న‌టించిన విన‌య్ రాయ్ ప్ర‌స్తుతం కోలీవుడ్ విల‌న్‌గా సెటిల్ అయిన విష‌యం తెలిసిందే. డిటెక్టివ్‌, డాక్ట‌ర్ ఈటీ లాంటి చిత్రాల్లో హీరోల‌కు ధీటుగా క‌నిపించి మెప్పించిన విన‌య్‌తో విమ‌ల‌రామ‌న్ రామ‌న్ వివాహం జ‌రుగ‌నున్న‌ద‌ట‌. గ‌త కొన్నేళ్లుగా ఈ జంట డేటింగ్‌లో ఉన్నార‌ని త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్టు కోలీవుడ్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇటీవ‌లే విమ‌లా త‌న ఇన్‌స్టాగ్రామ్ లో విన‌య్ తో క‌లిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. త్వ‌ర‌లోనే వీరి వివాహం విష‌యం గురించి అధికారికంగా తెల‌ప‌నున్నార‌ట‌. మ‌రి ఈ వార్త‌లో వాస్త‌వం ఎంత ఉందో తెలియాలంటే ఈ జంట నోరు విప్పే వ‌ర‌కు ఆగాల్సిందే..!

Advertisement

Visitors Are Also Reading