Home » భ‌ర్త సినిమాల్లో సుహాసిని న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా..!

భ‌ర్త సినిమాల్లో సుహాసిని న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా..!

by AJAY
Ad

దేశంలోని టాప్ ద‌ర్శ‌కుల‌లో మ‌ణిర‌త్నం ఒక‌రు. ప్రేమ కావ్యాల‌ను తెర‌కెక్కించ‌డంలో మణిర‌త్నం ను మించిన ద‌ర్శ‌కుడు లేడ‌ని చెప్ప‌డానికి సందేహం అవ‌స‌రంలేదు. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలను తీసిన మ‌ణిర‌త్నం తెలుగు,త‌మిళ‌,మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. బాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా మ‌ణిర‌త్నం దర్శ‌క‌త్వంలో ఒక్క సినిమాలో న‌టించా చాల‌ని అనుకునేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. మ‌ణిరత్నం ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన సినిమాల్లో అంజ‌లి,గీతాంజ‌లి, బొంబాయి, ఇద్ద‌రు లాంటి సినిమాలు భారీ విజ‌యం సాధించాయి.

mani ratnam

mani ratnam

గీతాంజ‌లి సినిమా తెలుగు వారికి మ‌ణిర‌త్నం ను మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. నిజానికి మ‌ణిర‌త్నం దర్శ‌కుడిగా మారేందుకు ఎవ‌రి ద‌గ్గ‌రా అసిస్టెంట్ గా పనిచేయ‌క‌పోవ‌డం చెప్పుకోద‌గ్గ విష‌యం. మ‌ణిర‌త్నం తండ్రికి ముంబై లో ఓ స్టూడియో ఉండేది. అక్క‌డ‌కు సినిమా వాళ్లు త‌ర‌చూ వ‌స్తూ వెళుతుండేవార‌ట‌. అలా మ‌ణిర‌త్నం మ‌న‌సు కూడా సినిమాల వైపుకు మ‌ళ్లింద‌ట‌.

Advertisement

Advertisement

ALSO READ : “అక్క‌డ షేవ్ చేసుకోలేదా” అంటూ నెటిజ‌న్ గ‌లీజ్ ప్రశ్న‌…ఇచ్చిప‌డేసిన చిట్టి..!

mani ratnam suhasini

mani ratnam suhasini

దాంతో ఎక్క‌డా అసిస్టెంట్ గా ప‌నిచేయ‌కుండానే మ‌ణిర‌త్నం సినిమాను తెర‌కెక్కించారు. ఇదిలా ఉంటే మ‌ణిర‌త్నం వివాహం చేసుకున్న‌ది మ‌రెవ‌రినో కాదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సుహాసినినే…కానీ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు తీసిన మ‌ణిర‌త్నం ఒక్క సినిమాలోనూ సుహాసిని న‌టించ‌క‌పోవ‌డం విడ్డూరం. అయితే ఈ విష‌యం పై వీరిద్ద‌రూ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.

mani ratnam suhasini

mani ratnam suhasini

త‌న‌కు ఎప్పుడూ మ‌ణిర‌త్నం సినిమాల్లో న‌టించాల‌ని అనిపించ‌లేద‌ని సుహాసిని సింపుల్ గా ఆన్స‌ర్ ఇచ్చేసింది. మ‌రోవైపు మ‌ణిర‌త్నం కూడా త‌న గురించి మంచి క‌థ రాయాల‌నిపిస్తుంది కానీ నా డైరెక్ష‌న్ లో న‌టించ‌మ‌ని అడ‌గ‌లేక‌పోయా అంటూ స‌మాధానం ఇచ్చారు. మ‌రి మ‌ణిర‌త్నం ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్ ల‌లో అయినా సుహాసిని న‌టిస్తుందా లేదా చూడాలి.

Visitors Are Also Reading