వైష్ణవి కుటుంబ నేపథ్యం కావడంతో రామోజీరావు తల్లి చాలా భక్తి భక్తురాలు. అందుకనే చిన్నతనంలోనే రామోజీ రావుకి భక్తి ఎక్కువే. రామోజీరావు మరణం బాధాకరం. ఆయన మరణం తీరనిలోటు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్వాస విడిచారు. రామోజీ రావు పేరు జనాల్లోకి ఎంతలా వెళ్ళింది అంటే ఆయన గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ప్రింట్ మీడియాలో ఆయన ఒక కొత్త ఒరవడి సృష్టించారు సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు.
Advertisement
అంతేకాకుండా దేశంలో అద్భుతంగా రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. అయితే ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే కానీ అరుదైన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం… రామోజీరావు కి వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య. ఆ పేరు నచ్చని ఆయన తన పేరుని రామోజీగా మార్చుకున్నారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి లో 1936 నవంబర్ 18న ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు.
Advertisement
Also read:
తాతయ్య రామయ్య కుటుంబంతో కలిసి పేరుశేపల్లి నుండి పెదపారుపూడి కి వలస వచ్చారు. తాత చనిపోయిన 13 రోజులకి రామోజీరావు పుట్టారు. అందుకని రామయ్య అని పేరు పెట్టారు. చదువు పూర్తయిన తర్వాత ఢిల్లీలో అడ్వటైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా మొదట ఉద్యోగం చేశారు. 1962లో హైదరాబాద్ కి తిరిగి వచ్చి పత్రికారంగా వైపు దృష్టి పెట్టారు. ఈనాడు పత్రిక స్థాపించడానికి ముందు ఎన్నో వ్యాపారాలు చేశారు. పత్రికా డిజిటల్ రంగంలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి నూతన వరవడి సృష్టించారు ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. హాలీవుడ్ తరహాలో ఫిలిం సిటీ నిర్మించాలని ఆయన అనుకున్నారు. ఆ కల నెరవేర్చుకోవడానికి రామోజీ ఫిలిం సిటీ నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీ లోని నివాసానికి ఆయన పార్ధివదేహాన్ని తరలించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!