అప్పటి టాలీవుడ్ టాప్ హీరోలలో మొట్టమొదట మనకి గుర్తొచ్చేది ఎన్టీఆర్. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకి పెట్టింది పేరు. అలానే చాలా రకాల సినిమాల్లో నటించేవారు ఎన్నో సినిమాలతో హిట్లు కొట్టారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పట్లో టాప్ హీరోగా కొనసాగించారు 150 కి పైగా సినిమాల్లో నటించి మెగాస్టార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ప్రేమ కథ మూవీలు సెంటిమెంట్ సినిమాలు రూపొందుతున్న రోజుల్లో అడవి రాముడు సినిమాతో కమర్షియల్ చిత్రాలకి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్ రాఘవేంద్రరావు. ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబినేషన్లో తర్వాత సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Advertisement
తమిళ్లో శివాజీ గణేషన్ మూడు పాత్రలలో నటించిన దైవమగన్ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని రాఘవేంద్రరావు అనుకున్నారు కానీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. శివాజీ గణేషన్ కెరియర్ లో అదొక మైలురాయిని ఆ పాత్రను పోషించడానికి శివాజీకే సాధ్యమని దానిని టచ్ చేయడం కూడా ఇష్టం లేదని చెప్పారట ఎన్టీఆర్. 1974లో శివాజీ గణేషన్ తంగపతకం సినిమా రీమేక్ చేయాలని అల్లు రామలింగయ్య హక్కులని కూడా తీసుకున్నారు. ఎన్టీఆర్ తో రీమేక్ చేయాలనుకున్నారు. శివాజీ గణేషన్ ఒప్పుకోలేదు.
Advertisement
Also read:
Also read:
ఈ సినిమాలోని కొన్ని అంశాలను తీసుకుని కొండవీటి సింహం కథను సిద్ధం చేశారు ఒక పాత్రని ఎన్టీఆర్, ఇంకో పాత్ర కోసం చిరంజీవిని తీసుకోవాలని అనుకున్నారు. ఎన్టీఆర్ కోసం ఒక యంగ్ హీరో క్యారెక్టర్ క్రియేట్ చేశారు. చిరంజీవి గీతలపై ఒక పాటను కూడా ప్లాన్ చేశారు అప్పట్లో ఈ వార్త రావడంతో ఇండస్ట్రీలో పెద్ద న్యూస్ అయిపోయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో దానికంటే ముందు తిరుగులేని మనిషి వచ్చింది. ఆ సినిమాని కూడా రాఘవేంద్ర రావే తీశారు అయితే అది ఫ్లాప్ అవడంతో కొండవీటి సింహం చిత్రం నుండి కూడా చిరంజీవిని తప్పించేశారు. ఆ స్థానంలో మోహన్ బాబుని తీసుకున్నారు ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకుంది కోటి 25 లక్షల రూపాయలని వసూలు చేసింది అంతకు ముందు రికార్డులని కూడా బద్దలు కొట్టేసింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!