Virat Kohli : ప్రస్తుతం ఐపీఎల్ హవా నడుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్లు వరుస పెట్టి జరుగుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు విపరీతమైన ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం పై ఎన్నో ట్రోల్స్ వస్తూ ఉంటాయి. తాజాగా కోహ్లీకి అభిమాని ఈ విధంగా లేఖ రాశారు. ఇక లెటర్ లో ఏం రాశారు అనే విషయానికి వస్తే.. డియర్ విరాట్ కోహ్లీ. 2008లో ఐపీఎల్ మొదలైంది.
Advertisement
అప్పటినుండి లీగ్ ఆడుతున్నావ్ అప్పటినుండి ఆర్సీబీ లోనే ఉన్నావు. నీ మీద ప్రేమతో మేము కూడా ఆర్సీబీ ఫాన్స్ అయ్యాము. ఐపీఎల్ ఆడుతూనే అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ గా ఎదిగావు క్రికెట్ ప్రపంచంలో రాజుగా మారిపోయావు. ప్రతి జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నోసార్లు జట్టును గెలిపించావు టీమిండియా లో ఎంత తీవ్రతతో ఆడావో అదే తీవ్రతతో ఆర్సిబి కి కూడా ఆడుతున్నావు గత 17 ఏళ్లుగా నువ్వు ఇదే పని చేస్తున్నావు కానీ క్రికెట్ అనేది ఒక్కరు మాత్రమే ఆడే ఆట కాదు కదా..?
వ్యక్తిగత ఆట అసలే కాదు నువ్వు ఆడుతున్న ఆటలో కనీసం సగం అయినా మిగిలిన వాళ్ళు ఆడి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. చెన్నై ముంబై జట్ల కంటే మనమేం తక్కువ కాదు వాళ్ళు ఐదేసి సార్లు ఛాంపియన్లుగా నిలిచారు కానీ మన పరిస్థితి ఏంటి..? ఆటగళ్ళు లేరా వనరులు లేవా అంటే అది కాదు మరి ఇంకేం కావాలి ఇంకా ఎన్ని రోజులు మేము ఇలానే నిరీక్షించాలి రెండేళ్ల క్రితం టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఛాంపియన్ గా గెలిచింది కానీ మనం మాత్రం ఎందుకు గెలవలేక పోతున్నాము..? జట్టులో ఇతర ఆటగాళ్లు నీకు మద్దతుగా నిలవట్లేదా 2016 సీజన్ లోను అదే జరిగింది. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు తీసుకెళ్లావు కానీ అక్కడ కూడా అదే కథ. ప్రతి సీజన్లో ఈసాల కప్ అని చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. నెక్స్ట్ మళ్ళీ ఈసాల కప్ అని కన్వర్ట్ చేసుకోవడం బాధగా ఉంది.
Advertisement
Also read:
- ప్రేమ పెళ్లి చేసుకోవడం వలన కలిగే లాభాలు ! ఇన్ని ఉన్నాయా ? అమ్మో
- Ugadi Rashi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు 2024 నుంచి 2025 వరకు
- పోకిరి vs అత్తారింటికి దారేది రెండిటిలో ఏది పెద్ద హిట్ ?
అయినా నీ తప్ప ఏమీ లేదు ఎందుకంటే నువ్వు జట్టు కోసం వందకి వంద ఇస్తున్నావు. ఎబి డివిలియర్స్, క్రిస్ గేల్ ఉన్నప్పుడైనా బాగుండేది ఆర్సిబి బ్యాటింగ్ అయినా బాగుంది అని చెప్పుకునే వాళ్ళము. అలా మీరు ఆడేవారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది నువ్వు లేకపోతే మనం బ్యాటింగ్ చేయలేము అసలు ఆర్సిబి యజమాన్యం ఐపీఎల్ అంటే ఏమనుకుంటుందో తెలియట్లేదు. అన్బాక్స్ ఈవెంట్లు పార్టీలు ఇవే కప్పును తెచ్చి పెట్టేవి అనుకుంటున్నారేమో కనీసం వచ్చేసరి మెగా వేలానికి కనీసం ఇద్దరు ఆర్సిబి ఫ్యాన్లు తీసుకెళ్లండి జట్టుకి ఎటువంటి ఆటగాళ్లు కావాలో మీకంటే మాకు ఎక్కువ తెలుసు. సారీ విరాట్ కోహ్లీ నువ్వు ఆర్సీబీ లో కాకుండా వేరే ఏదైనా టీం లో ఉంటే సగం ట్రోఫీలు నీ దగ్గరే ఉండేవి మా కోసం ఆడుతున్నందుకు థాంక్స్ అని అభిమాని లెటర్ రాశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!