ప్రస్తుతం ఎక్కువగా హార్రార్ సినిమాలను వీక్షీంచేందుకు ప్రేక్షకులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. వాస్తవానికి హర్రర్ సినిమాలకు ఇప్పటి నుంచి కాదు.. చాలా ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది. ఉన్నట్టుండి ప్రేక్షకుడు ఒక్కసారిగా ఉలిక్కి పడతే.. ఆ కిక్కే వేరు. అలా చాలా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా ఇంటి నెం.13 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పన్నా రాయల్ దర్శకత్వం వహించారు. గతంలో కాలింగ్ బెల్, రాక్షసి వంటి హార్రర్ సినిమాలను తెరకెక్కించారు. ఇంటి నెం.13 మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
నటీనటులు : నవీద్ బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్ రాజ్, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, సుదర్శన్ తదితరులు.
రచన, దర్శకత్వం : పన్నా రాయల్
సంగీతం : వినోద్ యాజమాన్య
సినిమాటోగ్రఫీ : పీ.ఎన్.మణికర్ణన్
ఎడిటింగ్ : సాయినాథ్ బద్వేల్
మాటలు : వెంకట్ బాలగోని, పన్నారాయల్
సమర్పణ : డా.బర్కతుల్లా
నిర్మాత : హేసన్ పాషా
బ్యానర్స్ : రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్, డీ.ఎం. యూనివర్సల్ స్టూడియోస్
సినిమా నిడివి : 126 నిమిషాలు.
కథ మరియు విశ్లేషణ :
అర్జున్ ఒక రచయిత. అతను రాసిన ఓ నవల 10 లక్షల కాపీలు అమ్ముడుపోయిందంటూ అది ప్రింట్ చేసిన పబ్లిషర్ ఫోన్ చేసి చెబుతాడు. ఆ అచీవ్ మెంట్ కి బహుమానంగా ఒక విల్లా గిప్ట్ గా ఇస్తానంటాడు. దానికి సంబంధించిన తాళాలను తన అన్నయ్య సంజయ్ కి ఇవ్వమని చెబుతాడు అర్జున్. అలా సంజయ్, అతని భార్య నిత్య, పని మనిషి జేజమ్మ, ఆ ఇంట్లోకి దిగుతారు. ఆ తరువాత అర్జున్, నిత్య చెల్లెలు మధు కూడా వస్తారు. కొద్ది రోజులు బాగానే గడుస్తుంది. కానీ ఆ తరువాత నిత్యకు తెల్ల ముసుగు వేసుకున్న ఆకారాలు కనిపిస్తుంటాయి. దగ్గరికి వెళ్లి చూస్తే.. అక్కడ ఏమీ ఉండదు. అలాంటివి తరుచూ కనిపిస్తుండటంతో ఆమె మానసికంగా ఆందోళనకు గురవుతుంది. ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇది గమనించిన భర్త ఆమెకు చికిత్స చేయించేందుకు డాక్టర్ ని, సైకియాట్రిస్ట్ లను తీసుకొస్తాడు. ఫైనల్ గా గజానంద్(ఆనంద్ రాజ్)రంగంలోకి దిగుతాడు. ఆ ఇంట్లో కనిపిస్తున్న తెల్ల ముసుగు ఆకారాలు ఎవరివి.? అవి ఏం సాధించడానికి నిత్యను ఆవహించాయి? ఆ ఇంట్లోని సమస్యను ఏవిధంగా పరిష్కరించాడు..? అనే విషయాలకు సమాధానమే ఈ చిత్రం యొక్క కథ.
Advertisement
సాధారణంగా దెయ్యాలకు సంబంధించిన ఏ సినిమా అయినా ఆ ఇంట్లో ఉండే సమస్యతోనే ప్రారంభం అవుతుంది. ఇందులో అలాంటి సమస్యనే అయినా దానిని చెప్పిన విధానం విభిన్నంగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా తెరకెక్కించారు దర్శకుడు. అప్పుడప్పుడు వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తాయి. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. ముఖ్య పాత్రలు పోషించిన నవీద్, శివాంగి మెహ్ర తమ పాత్రలకు న్యాయం చేశారు. మెయిన్ హైలెట్ గా చెప్పుకోదగిన గజానంద్ పాత్రను ఆనంద్ రాజ్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. అతిథి పాత్రలో కనిపించిన తనికెళ్ల భరణి, శ్రీలక్ష్మీ, పృథ్విరాజ్, సుదర్శన్, శివన్నారాయణ, రవివర్మ తమ పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. పి.ఎస్.మణికర్ణన్ సినిమాటోగ్రఫీ హైలెట్ అనే చెప్పాలి. ఎడిటర్ సాయి బద్వేల్ బాగానే ఎడిట్ చేశారు. మాటలు కూడా పర్వాలేదనిపించాయి. నిర్మాత హేసన్ పాషా పెట్టిన ఖర్చు స్క్రీన్ పై కనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది.
Also Read : రచ్చ సినిమా షూటింగ్ లో ఏం జరిగింది..? తమన్నా రామ్ చరణ్ తో మాట్లాడలేదు ఎందుకు..?